Moviesబిగ్ బాస్ 7 ఉల్టా పల్టా..ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్...

బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా..ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!?

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎలా రసవతరంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొత్త జనాలకు ఇది విసుగెత్తిస్తున్న చూసే జనాలకు మాత్రం ఈ సీజన్ బాగా మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది . అవసరం లేకపోయినా తగాదాలు వేసుకోవడం ..కరెక్ట్ గా నామినేషన్ ఎపిసోడ్లో గొంతులో చించుకొని అరవడం ..ఆ తర్వాత సారీ అంటూ మళ్ళీ హగ్గులు ఇచ్చుకోవడం ..చాలా చాలా కామన్ .

మరీ ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏ కాంటెస్ట్ ఎలిమినేట్ అవుతాడో తెలియని భయంతో కంటెస్టెంట్ లు టెన్షన్ పడుతూ ఉంటారు .గత నాలుగు వారాలలో నలుగురు మహిళా కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే . దీంతో ఐదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో పదిమంది కంటెస్టెంట్లు ఉన్నారు . ఈ వారం నామినేషన్ లో తేజ, శివాజీ ప్రియాంక, అమరదీప్ ,శుభశ్రీ, యావర్ , గౌతమ్ లు ఉన్నారు . కాగా ఇప్పటికే ఓటింగ్ క్లోజ్ అయ్యాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హౌస్ నుంచి శుభశ్రీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది .

మొదట్లో చాలా సైలెంట్ గా ఉన్న ఈమె ఆ తర్వాత కొంచెం కొంచెంగా పికప్ అయింది . కానీ హౌస్ లో ఆమె వల్ల ఏమి ప్రయోజనం లేదు అంటూ బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేశారట . అంతేకాదు ఈవారం చాలా స్పెషల్ హౌస్ లోకి ఏకంగా ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు రాబోతున్నారు అంటూ నాగార్జున హింట్ ఇచ్చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఆరుగురు కంటెస్టెంట్ల పేర్లు వైరల్ అవుతున్నాయి .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news