టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు . వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టూవర్టుపురం గజదొంగ పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తుంది . మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
దీంతో సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు టీం . అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించిన పాత్ర కోసం ముందుగా హీరోయిన్ రమ్యకృష్ణను అప్రోచ్ అయ్యారట మేకర్స్.
అయితే కథ విని ఎందుకో కాంట్రవర్షల్ అవుతుంది అనిపించిన రమ్యకృష్ణ సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత కూడా చాలామందిని ఈ రోల్ కోసం అనుకున్నారట డైరెక్టర్ వంశీ . కానీ ఫైనల్లీ ఆ పాత్రకు రేణు దేశాయ్ అయితే ఆప్ట్ గా సెట్ అవుతుంది అంటూ రవితేజ నే చూస్ చేశారట. అలా రవితేజ చూస్ చేసుకున్న రేణు దేశాయ్ ఈ పాత్ర ద్వారా మనకి మరికొద్ది గంటల్లో కనిపించబోతుంది..!!