Moviesబిగ్ బాస్ పై కోపంతో రతిక ఆ రెమ్యూనరేషన్ ని ఏం...

బిగ్ బాస్ పై కోపంతో రతిక ఆ రెమ్యూనరేషన్ ని ఏం చేసిందో తెలుసా..? పౌరుషం గల బిడ్డే..!!

గత సీజన్స్ బిగ్ బాస్ వేరు .. ఈ సీజన్ బిగ్ బాస్ వేరు అని .. ముందుగానే నా హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. అయితే నాగార్జున చెప్పింది తూచా తప్పకుండా పాటించేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ . అందుకే ఉల్టా పల్టాకు మించిన రేంజ్ లో ఈసారి కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ కంటెస్టెంట్స్ కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసిన హౌస్ మేట్స్ ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నారు .

దీంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరింత రసవత్తరంగా సాగుతుంది . కాగా ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు అందాల ముద్దుగుమ్మలు ఎలిమినేట్ అయిపోయారు. రీసెంట్ గానే హౌస్ లో టాప్ పొజిషన్లో ఉంటది అని.. ట్రోఫీ కూడా అందుకోబోతుంది అంటూ ప్రచారం చేసిన రతిక రోజ్..ఎలిమినేట్ అయింది. అయితే దీనికి కారణం ఆమె హౌస్ లో డబల్ గేమ్స్ అంటూ కొందరు అంటుంటే మరికొందరు ఆమెను నమ్మించి మోసం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మొత్తానికి మోసపోయిందో మోసం చేసిందో తెలియదు కానీ రతిక బిగ్ బాస్ హౌస్ ఇంటికి వచ్చేసింది. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తరచు చేసిన వారికి పరోక్షకంగా కౌంటర్ ఇస్తుంది . అయితే బిగ్బాస్ లో ఉన్న నాలుగు వారాలకి గాను అమ్మడు ఏకంగా ఎనిమిది లక్షలు చార్జ్ చేసిందట. వారానికి రెండు లక్షల చొప్పున నాలుగు వారాలకు ఎనిమిది లక్షలు తీసుకుందట . అయితే ఎనిమిది లక్షల్లో ఒక్క రూపాయి కూడా రతిక .. తన సొంత ప్రయోజనం కోసం వాడలేదని .. మొత్తం చారిటీకి రాయి ఇచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ పై కోపంతోనే రతిక ఈ రెమ్యూనరేషన్ మొత్తం చారిటీకి రాయించింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news