నిజంగా నితిన్ తన ఛలో సినిమాతో రష్మికకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఆమె ఈపాటికే కన్నడ కుర్ర హీరో రక్షిత్ శెట్టిని ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో కూర్చుని ఏ గృహిణిగానో కాలం గడిపేస్తూ ఉండాల్సి వచ్చేదేమో..! అప్పటికే రష్మిక కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్ టైం లోనే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
ఆ తర్వాత ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు.. చాలా తక్కువ టైంలోనే మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాలో ఛాన్స్.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి గీతగోవిందం – పుష్ప ఇలా ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఛలో సినిమా హిట్ అయిన వెంటనే మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ రావడంతో రష్మిక తనకు పెళ్లి వద్దని షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
వెంటనే రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని బ్రేకప్ చెప్పేసి తన కాన్సన్ట్రేషన్ సినిమాలపై పెట్టేసింది. ఇక అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. రష్మిక ఇప్పుడు ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. పుష్ప సినిమాతో ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విరాజీపేటలో ఆమె జన్మించింది.
ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఆ తర్వాత బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ – జర్నలిజం – ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. అలా రష్మిక ఒకటి, రెండు కాదు ఏకంగా ట్రిపుల్ గ్రాడ్యుయేట్ సాధించింది. అలా ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.