Moviesమరికొద్ది గంటల్లో "భగవంత్ కేసరి" రిలిజ్ అవుతుంది అన్న టైంలో బాలయ్య...

మరికొద్ది గంటల్లో “భగవంత్ కేసరి” రిలిజ్ అవుతుంది అన్న టైంలో బాలయ్య ఏం చేశాడో తెలుసా.. కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . అంతేకాదు మొదటి నుంచి సినిమాపై ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాను అనిల్ రావిపూడి .

బాలయ్య అభిమానులు ఆయనను ఎలా చూడాలి అనుకున్నారో అలాంటి లుక్స్ లో అలాంటి డైలాగ్స్ తో మనకు కనిపించేలా చేసి నందమూరి అభిమానుల ఆకలి తీర్చేసాడు . కాగా జనరల్ గా బాలయ్య తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కొంచెం టెన్షన్ పడతారు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టదట. ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా టాక్ ఎలా ఉంది అని అప్పుడు ఆరా తీస్తారు.

అయితే భగవంత్ కేసరి సినిమా విషయంలో మాత్రం బాలయ్య పూర్తిగా ఆపోజిట్ గా ప్రవర్తించారట . అసలు సినిమా గురించి ఏమాత్రం దిగులు లేకుండా రాత్రంతా హ్యాపీగా పడుకునేసరట . అంతేకాదు ఉదయాన్నే లేచి అమ్మవారికి పూజ చేసుకొని హ్యాపీగా తన పనులు తాను చూసుకుంటూ ఉన్నాడట. అప్పుడే అనిల్ రావిపూడి కాల్ చేసి మరి సినిమా సూపర్ హిట్ సార్ అంటూ చెప్పుకొచ్చారట . ఈ సినిమాపై అనిల్ రావిపూడి పై అంత నమ్మకం పెట్టుకున్నాడు బాలకృష్ణ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . బాలయ్య వీరసింహారెడ్డిని మించిన హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అని అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news