అలియా భట్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పలు ప్రతిష్టాత్మక పాత్రలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ గానే గంగుబాయి కతియవాడి సినిమాకి గాను ఉత్తమ నటిగా ఈమెను అవార్డు వరించింది . నిన్న రాష్ట్రపతి చేతుల మీదగా ఈమె ఆ అవార్డు అందుకుంది .
ఈ కార్యక్రమానికి ఆమె తన భర్తతో చాలా స్టైలిష్ అండ్ సింపుల్ లుక్ లో వచ్చింది. అంత పెద్ద హీరోయిన్ చాలా సింపుల్ లుక్ రావడం అభిమానులను బాగా ఆకట్టుకునింది . అంతేకాదు అవార్డు అందుకుంటున్నప్పుడు ఆమె కట్టుకున్న చీర చాలా చాలా స్పెషల్ . ఎందుకంటే అది ఆమె పెళ్లి చీర . రన్బీర్ కపూర్ ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఈ చీరను తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకుంటున్నప్పుడు కట్టుకోవడం ఫాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది.
అలియాభట్ ఇంత సెంటిమెంటల్ ఫెలోనా అంటూ కామెంట్స్ చేస్తుంటే.. ప్రతి భార్యకు తన భర్త ఇచ్చిన గిఫ్ట్ ఎంతో అపురూపమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు గంగుబాయి ఖతియవాడి సినిమాలో అలియా భట్ పెర్ఫార్మెన్స్ టు గుడ్ అంటూ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ ఆమెకి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!