Moviesవామ్మో.. మహేశ్ బాబు వేసుకున్న చెప్పులు అంత కాస్ట్లీ నా..స్పెషలిటి ఏంటో...

వామ్మో.. మహేశ్ బాబు వేసుకున్న చెప్పులు అంత కాస్ట్లీ నా..స్పెషలిటి ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కంప్లీట్ అయింది . ప్రజెంట్ డబ్బింగ్ పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబుని మనం విభిన్న కోణంలో చూడబోతున్నామంటూ కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. కాగ రీసెంట్గా దసరా సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నాం అంటూ చెప్పుకోచ్చారు .

అయితే ఇదే క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు వేసుకున్న చెప్పులు చాలా అట్రాక్టివ్ గా కనిపించాయి. బండి వెనకాల డిక్కీలో సిగరెట్ తాగుతూ పెద్ద ఫైటింగ్ కి సిద్ధమవుతున్నట్లు మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ పోస్టర్లో మహేష్ బాబు వేసుకున్న చెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి. ఎకో అప్‌రోడ్ అనే కంపెనీ తయారు చేసిన చెప్పులుగా ఇవి తెలుస్తుంది .

ఇవి చాలా చాలా ఖరీదు . దీని ఖరీదు సుమారు 9000 అని జనాలు చెప్పుకొస్తున్నారు. సామాన్లు ధరించే వాటితో పోలిస్తే ఇవి చాలా చాలా ఎక్కువ .అయితే మహేష్ బాబు రేంజ్ కి ఇది తక్కువనే చెప్పాలి . మొత్తానికి మహేష్ బాబు వేసుకున్న చెప్పుల ద్వారా గుంటూరు కారం సినిమా హాష్ ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి . సినిమాకి మంచి బాజ్ క్రియేట్ చేశాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news