బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా కపుల్ గా పాపులారిటి దక్కించుకున్నారు రన్బీర్ సింగ్ – దీపిక పదుకునే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఇండస్ట్రీలో టాప్ హీరోలు హీరోయిన్లు . ఒక్కొక్కరు సినిమా కోసం కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటుంటారు . ఈ జంట దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది . 2018లో వీరి వివాహం ఘనంగా జరిగింది . వీళ్ళ పెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే చాలా సెన్సేషన్ గా మారింది .
డబ్బును నీళ్ల రూపంలో కుమ్మరించేశారు ఈ జంట. అంత ఘనంగా అంగరంగ వైభవంగా తమ పెళ్ళికి జరుపుకున్నారు. కాగా రీసెంట్గా వీళ్ల వెడ్డింగ్ కి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే వీళ్ళ కాస్ట్యూమ్స్ వీళ్ళ నగలు చూసిన జనాలు అసలు వీళ్ళ ఆస్తి ఎంత ఉంటుంది ..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు . దీంతో సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి .
రన్వీర్ సింగ్ – దీపికా పదుకొనే టోటల్ ఆస్తులు కలిపి 900 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీపికా పదుకొనే సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 497 కోట్లు సంపాదించిందట . అలాగే రన్వీర్ సింగ్ సైతం 377 కోట్లు సంపాదించారట . ఈ లెక్కన చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీ గా ఉన్న అల్లు అర్జున్ నే మించిపోయింది దీపికా పదుకొనే. అల్లు అర్జున్ టోటల్ సంపాదించిన ఆస్తి 470 కోట్లు. అయితే దీపికా పదుకొనే మాత్రం ఆయనను మించిపోయింది. ప్రజెంట్ ఇదే న్యూస్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!