Moviesఅమ్మ బాబోయ్..ప్రభాస్ ఫేవరేట్ సినిమా అదా..? టైం దొరికితే ఆ మూవీనే...

అమ్మ బాబోయ్..ప్రభాస్ ఫేవరేట్ సినిమా అదా..? టైం దొరికితే ఆ మూవీనే చూస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తమ కెరియర్ లో నటించిన ఓ సినిమా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. పదేపదే అలాంటి సినిమాలు చేయాలి అని ఆశగా ఉంటుంది . కానీ అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు . అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశారు. కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్ లు అయ్యాయి.

అయితే ప్రభాస్ కి మాత్రం ఇష్టమైన సినిమా ఏది అంటే కచ్చితంగా బుజ్జిగాడు అని చెప్తాడట . ఆయన కెరియర్ లో బుజ్జిగాడికి మించిన హిట్స్ ఎన్నెన్నో ఉన్నాయి . కానీ బుజ్జిగాడు సినిమా ఆయనకు బాగా నచ్చేసింది అని .. అలాంటి రోల్ ఇక నేను లైఫ్ లో ప్లే చేయలేనేమో అంత బాగా నేను ప్లే చేశాను అన్న ఫీలింగ్ నాకు కలిగింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్గా నటించిన సినిమా బుజ్జిగాడు . ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ చాలా చాలా ఆకట్టుకుంటుంది . అంతేకాదు ఆరడుగుల ప్రభాస్ ని చాలా నాటిగా చూపించాడు పూరీ జగన్నాథ్ .. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఏక్ నిరంజన్ వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా మారింది . ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా బుజ్జిగాడు సినిమా చాలా ఫేవరెట్ గా ఉంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news