Movies"మ్యాడ్" సినిమాకి ఎన్టీఆర్ బామ్మర్ది ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? బావనే...

“మ్యాడ్” సినిమాకి ఎన్టీఆర్ బామ్మర్ది ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? బావనే మించిపోతున్నాడే..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మ్యాడ్ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లో తాజాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది . ఈ సినిమాలో హీరో మరెవరో కాదు పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్.

అంతేకాదు దీనితో పాటు సినిమాలో సంగీత్ శోభన్ కూడా నటిస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్గా ఎన్టీఆర్ రిలీజ్ చేశారు . ట్రైలర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది . అంతేకాదు బామ్మర్ది హిట్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఎన్టీఆర్ ని కలవగా ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు .

కాగా ఈ సినిమా కోసం నార్నె నితిన్.. ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది . అయితే ఈ సినిమా కోసం నితిన్ ఒక్క రూపాయి కూడా పారితోషకం పుచ్చుకోలేదట . కేవలం ఈ సినిమాని ఫ్రీగా నటించారట. తనకు హిట్ ట్రాక్ పడే వరకు తన వల్ల మేకర్స్ లాభాలు తీసుకునే వరకు ఆయన ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమాలో నటించడానికి ఫిక్స్ అయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో అందరూ బావకు తగ్గ బామ్మర్ది అంటూ ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news