లావణ్య త్రిపాథి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది .మెగా ప్రిన్స్‌గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది లావణ్య త్రిపాఠి . వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చూస్తున్న టైం లోనే లవ్ లో పడ్డారు. ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఇన్నాళ్లకు ఓపెన్ అప్పయ్యారు .
వీళ్ళ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది . త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే అసలు లావణ్య మెగా ఫ్యామిలీ ఇంటికి ఎంత కట్నం తీసుకొస్తుంది అనే క్వశ్చన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకురావడం లేదట . అసలు మెగా ఫ్యామిలీ కట్నం అవసరం లేదు అంటూ తేల్చి చెప్పిందట . వరుణ్ లావణ్యను ప్రేమించుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండటమే మాకు చాలు . ఇక అంతకుమించిన కట్నం మాకు అవసరం లేదు అంటూ నాగబాబు – చిరంజీవి లావణ్య తల్లిదండ్రులకు క్లియర్ గా చెప్పారట.
కానీ లావణ్య పేరెంట్స్ తమకు ఉన్నంతలో ఆమెకు బాగానే ఇచ్చి పంపిస్తున్నట్టు తెలుస్తుంది . లావణ్య ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించిన డబ్బులు మొత్తం ఆమెకే ఇచ్చేస్తున్నారట . అంతేకాదు ఆమె కోసం తరతరాలుగా వస్తున్న ఆస్తిని సైతం సమాన వాటాగా వేసి లావణ్య పేరుపై రాసేసారట. అంతేకాదు లావణ్య కు వాళ్ళ అమ్మగారు చేర్చి పెట్టిన నగలు కూడా కట్నంగా ఇస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోని ఉపాసన తెచ్చిన కట్నం ముందు లావణ్య త్రిపాఠి తెస్తున్న కట్నం చాలా తక్కువే అయినా ..అందం – అణుకువ – మంచితనం సేవా కార్యక్రమాలలో ఉపాసన కంటే కూడా రెండు స్టెప్పులు ఎక్కువగానే ఉంటుంది లావణ్య త్రిపాఠి అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!