Moviesమెగా 156 టైటిల్ చూశారా..అద్దిరిపోయింది..జగదేకవీరుడు అతిలోకసుందరికి మించిపోయే హిట్ కన్ఫామ్..!!

మెగా 156 టైటిల్ చూశారా..అద్దిరిపోయింది..జగదేకవీరుడు అతిలోకసుందరికి మించిపోయే హిట్ కన్ఫామ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి తాజాగా కమిట్ అయిన సినిమా మెగా 156. బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఎలాంటి బజ్ ఉందో మనకు తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేశారు . ఈ సినిమా మొత్తం సోషియో ఫాంటసీ విధంగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు వార్తలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి . వశిష్ట హీరోయిన్స్ మిగతా నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన టైటిల్ వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకి చాలా పవర్ఫుల్ టైటిల్ను పెట్టాలని ఎప్పటినుంచి అనుకుంటున్నాడట వశిష్ట . అందుకే కథకు తగ్గట్టు ‘లోక కళ్యాణం’ , ‘ లోక నాయకుడు ‘ అనే టైటిల్స్ వచ్చే విధంగా పేరును చూస్ చేసుకున్నారట .

అయితే చిరంజీవికి ఆ రెండు పేర్లు పెద్దగా నచ్చలేదట . ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించు అంటూ సజెస్ట్ చేశారట . ఫైనల్లీ “విశ్వంభర” అనే ఓ సరికొత్త టైటిల్ ఈ మూవీకి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో రానా దగ్గుబాటి చిరంజీవికి విలన్ గా కనిపించబోతున్నాడట . హ్యూజ్ క్యాస్ట్ అండ్ క్రూ ద్వారా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి హిట్ తన ఖాతాలో వేసుకునేలానే కనిపిస్తున్నాడు చిరంజీవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news