సుమ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్. హీరోయిన్ కి మించిన రేంజ్ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని బుల్లితెరని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో రాకపోయినా హీరోయిన్ రాకపోయినా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రాకపోయినా పర్వాలేదు కానీ యాంకర్ సుమ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే . అంతలా జనాలు ఆమెని ఫిక్స్ అయిపోయారు.
రీసెంట్గా సుమ కొడుకు రోషన్ బబుల్గం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో పాటలు పక్కన పెడితే రొమాన్స్ మాత్రం హై రేంజ్ లో ఉంది . ఈ సినిమాలో ఎంత డీప్ రొమాన్స్ చేశారో.. రీసెంట్గా రిలీజ్ అయిన పిక్చర్స్ చూస్తే అర్థం అయిపోతుంది. అయితే సుమ తన కొడుకుని హీరోగా చేయడం కోసం స్టార్ట్ డైరెక్టర్ కాలు పట్టుకుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు రాఘవేందర్ రావు గారు.
సుమ – రాఘవేంద్రరావు గారి మధ్య చనువు ఎంత చనువుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు షూస్ లో వీళ్ళు సరదాగా మాట్లాడుకునే మాటలు బట్టి చెప్పేయొచ్చు వీళ్లు ఎంత క్లోజ్ అని .. అయితే తన కొడుకును రాఘవేందర్ రావు గారు డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయాలి అని సుమ చాలా చాలా ఆశ పడిందట. ఇంటికి వెళ్లి కూడా రిక్వెస్ట్ చేసిందట .. సరదాగా అదే టైంలో రాఘవేందర్ రావు గారు నా కాళ్లకు నమస్కరించి నీ కొడుకుని హీరోని చేస్తాను అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారట . సుమ సైతం అంతే ఫన్నీగా ఆయన పాదాలకు నమస్కరించిందట . అయితే ఆ తర్వాత రాఘవేంద్రరావు ఇప్పుడు సినిమాలు డైరెక్ట్ చేయడం లేదు అంటూ ఆమెకు పరిస్థితిని వివరించారట . అంతేకాదు తన కొడుకుకు మాత్రం ఏ విధంగా నటించాలి అనేది మాత్రం రాఘవేంద్రరావు క్లియర్ గా చెప్పుకొచ్చారట . అంతకుమించిన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!