Moviesఆ పాట వినగానే శ్రీలీలకు అంత ఊపు వచ్చిందా..? స్నేక్ డ్యాన్స్...

ఆ పాట వినగానే శ్రీలీలకు అంత ఊపు వచ్చిందా..? స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించిందట..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఆదికేశవ సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా ఓ సాంగ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంది . వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమా ” ఆది కేశవ ” .

ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలా నటిస్తుంది . దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు . కాగా ఈ పాటలోని లీలమ్మ సాంగ్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఓ ఈవెంట్ కండెక్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే వైష్ణవి మాట్లాడుతూ సినిమాకి శ్రీలిల ప్లస్ పాయింట్ అంటూ పొగిడేసారు .

అంతేకాదు శ్రీ లీలా మాట్లాడుతూ ..”ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అని ..రీసెంట్ గానే దసరా కంప్లీట్ అయింది. నవంబర్ 10వ తేదీ శివుడి పేరుతో మా సినిమా వస్తుంది .. ఈ పాట నాకెంతో ఇష్టమైంది. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట ఇదే కావడంతో మరింత ఇష్టంగా మారింది . ఈ సాంగ్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ పాట . వినగానే నాకు స్నేక్ డాన్స్ చేయాలనిపించింది” అంటూ కామెంట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news