రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయాడు రాజమౌళి . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదని మనకు తెలిసిందే. అలాంటి ఓ డెడికేషన్ తో సినిమాలను తరికెక్కిస్తాడు .
కాగా సినిమాల పరంగా ఎలా ఉన్న రాజమౌళి పర్సనల్ లైఫ్ లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ అభిమానులకి నచ్చలేదు . ఆల్రెడీ పెళ్లి అయిపోయి కొడుకు ఉన్న రమ్మను రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆయన అభిమానులకు నచ్చలేదు . అయితే మొదట్లో ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయకపోయినా.. ఆ తర్వాత రాజమౌళి మంచి మనసు తెలుసుకొని ఫాన్స్ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేశారు . అయితే సోషల్ మీడియాలో అప్పుడు రమకంటే ముందే రాజమౌళి మరో హీరోయిన్ ని ప్రేమించాడు అన్న వార్త కూడా వైరల్ అయింది.
రాజమౌళికి ఆ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం . ముందు నటన పరంగా చాలా ఇష్టపడిన ఆయన.. ఆ తర్వాత ఆమెను నిజంగానే ప్రేమించడం స్టార్ట్ చేశారట . అయితే అప్పట్లో ఆయనకు తన ప్రేమ విషయాన్ని చెప్పే అంత ధైర్యం కూడా ఉండేది కాదట . అందుకే తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పకుండా లోపల ప్రేమిస్తూ ఉండిపోయాడు. లైఫ్లో సెటిల్ అయ్యాక ఆమెకు తన ప్రేమ విషయాలు చెబుదామని అనుకున్నాడట. ఈలోపే ఆ హీరోయిన్ వేరొకరిని పెళ్లి కూడా చేసేసుకుంది . దీంతో తీవ్రంగా హర్ట్ అయిన రాజమౌళి అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారట. ఫైనల్లీ రమను చూడగానే మళ్లీ ప్రేమ పై ఇంట్రెస్ట్ వచ్చింది రాజమౌళికి . అందుకే పెళ్లి అయ్యి అప్పటికే ఒక బిడ్డ ఉన్న రమను ఆయన పెళ్లి చేసుకొని ఆమెకు లైఫ్ ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!