సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి మించిన అందంతో చలాకితనంతో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది ప్రగతి . కొందరు ముద్దుగా ప్రగతి ఆంటీ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు ఆంటీ అన్న.. అమ్మాయి అన్న.. ప్రగతి మాత్రం అది పెద్దగా పట్టించుకోదు . తన పని తాను చూసుకుపోతూ ఉంటుంది. తన జోలికి వస్తే మాత్రం వదలదు సుమ చీల్చి చెండాడేసి రఫ్ఫాడించేస్తుంది. కాగా ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది .
ఇప్పటికే చాలాసార్లు ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా .. ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే మరోసారి ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు కూడా బయట పెడుతూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించుతూ ఉండడంతో ఇది నిజమే అనుకుంటున్నారు ఫాన్స్ . ప్రగతి సింగిల్ మదర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆమె చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయారు.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం.. తప్పుడు నిర్ణయంగా ప్రగతి బాధపడుతూ ఉంటుంది .
ఈ విషయాన్ని ఆమె స్వయాన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్న ప్రగతికు ఓ బడా ప్రొడ్యూసర్ రెండో పెళ్లి ప్రపోజల్ చేశారట . అయితే చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అనడంతో ప్రగతి ఆయనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ప్రతి మనిషికి ఒక తోడు అనేది అవసరమని .. అందుకే ప్రగతి కూడా లైఫ్లో సెకండ్ స్టెప్ తీసుకోవడానికి ఆ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట . ఈ మధ్యకాలంలో చాలామంది రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. నేను చేసుకుంటే తప్పు ఏంటి అన్న భావనలో ప్రగతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆ ప్రొడ్యూసర్ లుక్స్ వైజ్ బాగోదు.. ప్రగతి చాలా బాగుంటుంది. మరి ఇంత అందమైన ఆంటీకి అలాంటి బట్టతల అంకుల్ సెట్ అవుతాడా..? అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!