సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా నాగచైతన్య – సమంతల గురించి వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము . 2017 లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది . అయినా సరే వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి .
కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో సమంత నాగచైతన్యలకు సంబంధించిన ఓ పిక్చర్ వైరల్ గా మారింది. అయితే ఈ పిక్చర్ వాళ్లు పెళ్లి తర్వాత దిగిన పిక్చర్ . అయినప్పటికీ విడాకుల తర్వాత వీళ్ళు కలిసి దిగిన పిక్చర్ అంటూ ప్రచారం జరుగుతుంది . నాగచైతన్య సమంత కలిసి వ్యిర్ పోర్ట్ లో వెళ్తున్న ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది .
ఇది చూసిన జనాలు మళ్ళీ మీరు కలిస్తే బాగుండు అంటుంటే .. మరికొందరు ఇంత చక్కటి జంటకి ఏ దిష్టి తగిలిందో అంటూ బాధపడిపోతున్నారు. మరికొందరు సమంతను నాగచైతన్య ఇప్పటికీ మీట్ అవుతున్నాడు అని .. ఆమె అంటే అంత ఇష్టమని కానీ ఈగో ప్రాబ్లమ్స్ కారణంగానే దూరం దూరంగా ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు..!!