రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రోగాల బారిన పడుతున్నారు . అది కూడా అతి భయంకరమైన రేర్ డిసీజెస్ కి గురవుతూ ఉండడం ఇప్పుడు అభిమానులకి కంటిమీద కొడుకు లేకుండా చేస్తుంది. రీసెంట్ గానే హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే .
ఆ వ్యాధి కారణంగా ఇప్పటికీ బాధపడుతుంది సమంత . అయితే ఆ తర్వాత కూడా పలువురు హీరోయిన్స్ రకరకాల వింత వ్యాధులకు గురైనట్లు చెప్పుకొచ్చారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు ఓ వింత జబ్బు ఉంది అనే విషయాన్ని బయట పెట్టింది .
ఎంత డైట్ చేసినా.. ఎన్ని వర్కౌట్స్ చేసినా.. తన బాడీకి ఏం కాదట. ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట. ఒకవేళ తాను ఏవైనా పనుల్లో పడిపోయి మూడు రోజులు నాలుగు రోజులు జిమ్ కి వెళ్ళకపోతే మాత్రం బీభత్సంగా బరువు పెరిగిపోతుందట . అది తగ్గడానికి సుమారు పది రోజుల కష్టపడాల్సి వస్తుందట . అందుకే ఎన్ని పనులు ఉన్న జిమ్ మాత్రం మానను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది కాజల్. దీంతో ఇది కూడా ఓ వింత వ్యాధి అని జనాలు ఫన్నీ గా కామెంత్స్ చేస్తున్నారు..!!