Movies"ముద్దొచ్చేస్తున్నావ్ రా డార్లింగ్"..రాజా డిలెక్స్ నుండి క్రేజీ పిక్స్ లీక్..ఏమున్నాడ్రా...

“ముద్దొచ్చేస్తున్నావ్ రా డార్లింగ్”..రాజా డిలెక్స్ నుండి క్రేజీ పిక్స్ లీక్..ఏమున్నాడ్రా బాబోయ్..!!

అబ్బబ్బా.. మన డార్లింగ్ ఎంత ముద్దుగా ఉన్నాడో . ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే రెబెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా లేపేస్తున్నారు . మనకు తెలిసిందే ప్రజెంట్ ప్రభాస్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. వరుసగా బిగ్ బడాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం మారుతి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .

ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ తెర వెనక మాత్రం 80% షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రాజా డీలక్స్ అంటూ ఓ పేరును కూడా ఫిక్స్ చేశారు . కాగా ఇలాంటి క్రమంలోనే.. ఈ సినిమా నుంచి కొన్ని క్రేజీ పిక్స్ లీక్ అయ్యాయి . సోషల్ మీడియా షేక్ అయిపోయే విధంగా ప్రభాస్ మారుతి సినిమాల నుంచి ఓ ఫైట్ సీన్ కి సంబంధించిన పిక్స్ నెట్టింట లీక్ అయ్యాయి.

ఈ పిక్స్ లో ప్రభాస్ చాలా ముద్దుగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు . అంతే కాదు బాగా బరువు తగ్గిపోయి ఆరు అడుగుల అందగాడు కటౌట్ చూస్తుంటేనే కొరుక్కు తినేయాలనిపించే విధంగా ఉన్నాడు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . దీంతో ప్రభాస్ మారుతి సినిమాలపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news