కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లియో సినిమా విషయానికి వస్తే చాలా ఏళ్ల తర్వాత విజయ్ – త్రిష కలిసి నటించిన సినిమా ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటించారు.
దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ సినిమాని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని చిక్కులు ఉన్నట్టు సమాచారం. తెలుగు మినహా ప్రపంచ వ్యాప్తంగా లియో అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమయింది.
మామూలుగా 19వ తేదీన బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో పోటాపోటీగా తెలుగులో రిలీజ్ కు రెడీ అయింది. లియో ఎప్పుడు అయితే కోర్టు లియో సినిమాను తెలుగులో 20వ తేదీ వరకు వాయిదా వేయకూడదని ఆదేశించిందో ఇక 19వ తేదీన బాలయ్య సినిమాకు ఎదురు లేకుండా పోయింది.
బాలయ్య వార్ వన్ సైడ్ కానుంది. తొలిరోజు బాలయ్య వీరసింహారెడ్డి సినిమా సోలోగా రిలీజ్ కావడంతో తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రు. 54 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా తొలి రోజు సినిమాకు మంచి టాక్ వస్తే వీరసింహారెడ్డిని మించిన వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.