ఎస్ ప్రెసెంట్.. ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . బాలీవుడ్ నటుడు – డైరెక్టర్ – ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేసిన కాఫీ విత్ కరణ్ 7 సీజన్లు కంప్లీట్ చేసుకున్నాయి. రీసెంట్గా ఎనిమిదవ సీజన్ కూడా రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు కరణ్ జోహార్. సీజన్ 8 అక్టోబర్ 26 నుంచి మొదలవబోతోంది అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో కాఫీ విత్ కరణ్ స్ట్రీమింగ్ అవ్వనుంది అంటూ చెప్పుకొచ్చాడు . దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేశారు . ఈ ఎపిసోడ్ కి రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే కలిసి వచ్చి సందడి చేశారు . ఫుల్ ఆక్టివ్ మోడ్ లో.. చాలా ఫన్నీ ఫన్నీగా సరదాగా రొమాంటిక్ కరణ్ తో సందడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది .
అయితే మొదటినుంచి కాఫీ విత్ కరణ్ అనే షో పై అభిమానులకు చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది . కరణ్ చాలా వల్గర్ ప్రశ్నలు అడుగుతారు అని ..దానివల్ల భార్యాభర్తలు విడిపోయే వరకు కూడా వెళ్లారు అని.. అందుకే ఈ షో నీ కొంపలు కూల్చే షోగా చెప్పుకుంటూ ఉంటారు . దీంతో మరోసారి ఆ షో స్టార్ట్ అయిందా అంటూ షాక్ అయిపోతున్నారు. ఈసారి ఏ జంట విడాకులు తీసుకోవాల్సి వస్తుందో..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!