Moviesక్లింకారతో చరణ్-ఉపాసన ఫస్ట్ ఫారిన్ టూర్..ఎక్కడికి వెళ్తున్నారో తెలిస్తే ఎగిరి గంతులేయడం...

క్లింకారతో చరణ్-ఉపాసన ఫస్ట్ ఫారిన్ టూర్..ఎక్కడికి వెళ్తున్నారో తెలిస్తే ఎగిరి గంతులేయడం ఖాయం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకొచ్చాడు. ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న ఈయన కొద్దిసేపటి క్రితమే తన భార్య ఉపాసన తన కూతురు క్లింకారా తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి ఫారెన్ ట్రిప్ కి బయలుదేరారు .

దీనికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఎంత సినిమాలో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ వచ్చే చరణ్ తన కూతురు పుట్టాక ఫస్ట్ టైం భార్యతో ఫారిన్ ట్రిప్ కు వెళ్తున్నాడు . దీనికోసం ఎయిర్పోర్ట్ లో వాళ్లు కనిపించారు . దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే వీళ్ళు వెళ్లబోయేది ఎక్కడికో కాదు త్వరలోనే వరుణ్ పెళ్లి చేసుకోబోయే దేశం ఇటలీ.

అందరికంటే ముందుగానే చరణ్ ఉపాసన అక్కడికి వెళ్ళబోతున్నారు. క్లింకారకు అక్కడ క్లైమేట్ అలవాటు కావడం కోసం.. అలాగే కొంచెం సేపు క్లీం కార తో టైం స్పెండ్ చేయడం కోసం ..ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news