Newsబ‌న్నీ - త్రివిక్ర‌మ్ 4వ సినిమా స్టోరీ లైన్‌... ఈ పోలీస్...

బ‌న్నీ – త్రివిక్ర‌మ్ 4వ సినిమా స్టోరీ లైన్‌… ఈ పోలీస్ స్టోరీ సెట్ అవుతుందా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్‌ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్ లోనే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక పుష్ప ది రూల్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ – బన్నీ కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అలవైకుంఠపురంలో సినిమాలు మూడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో తెరకెక్కే నాలుగో సినిమా షూటింగ్ జనవరి మూడో వారం నుంచి ప్రారంభం కాబోతుందట.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఉంటుందని.. అందుకే కథ కూడా ముంబై నేపథ్యంలో జరిగే ఓ పోలీస్ డ్రామా అని తెలుస్తోంది. త్రివిక్రమ్.. బన్నీ తమ నాలుగో సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీ స్టొరీలకు కేరాఫ్ అడ్రస్. మరి ఇప్పుడు బన్నీతో ముంబై పోలీస్ స్టోరీ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా అంటే త్రివిక్రమ్ స్టైల్ కు కాస్త భిన్నంగా అనిపిస్తుంది.

ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో త్రివిక్రమ్ కూడా తప్పనిసరిగా పాన్ ఇండియా కథతోనే సినిమా చేయాల్సి వస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ – గీతా సంస్థ కలిపి ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనున్నాయి. తమన్ సంగీతమందించే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news