టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు.. క్రేజీ హీరోలు ఉన్న ఆ హీరోల భార్యలలో ఎవ్వరికీ లేనంత క్రేజ్.. పాపులారిటీ బన్నీ భార్య స్నేహ రెడ్డికి మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలామంది బాలీవుడ్.. సౌత్ స్టార్ హీరోయిన్లకు కూడా సోషల్ మీడియాలో లేని పాపులారిటీ.. అభిమానులు స్నేహ రెడ్డికి ఉన్నారు.
బన్నీ ఇటు సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా.. అటు తన ఫ్యామిలీకి ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలతో కలిసి విదేశీ వెకేషన్ లు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక స్నేహారెడ్డి ఒక్కోసారి హీరోయిన్ ను మించిన అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎలా ? వైరల్ అవుతాయో చూస్తూనే ఉంటాం. కొద్ది రోజుల వరకు లండన్ లో ఎంజాయ్ చేసి వచ్చిన ఈ జంట తిరిగి హైదరాబాద్కు వచ్చేసింది.
స్నేహ రెడ్డి హైదరాబాద్కు రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. కామన్ గా సెలబ్రిటీలు తిరుమల కి వస్తే పెద్ద ఎత్తున హంగామా చేస్తారు.. కానీ స్నేహ ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా ఫ్యామిలీ కూడా లేకుండా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకునే రావడం విశేషం. స్నేహ దీపాలు వెలిగిస్తూ కాలినడకన మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో చాలా సింపుల్ గా ఉందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బన్నీ అన్న లేకుండా మీరు ఒక్కరే తిరుమలకి వెళ్లారు.. స్నేహా మేడం మీరు చాలా సింపుల్ అంటూ స్నేహాను కామెంట్లతో ఆకాశానికి తెస్తున్నారు. ప్రస్తుతం ఆమె మెట్ల మార్గాన దీపాలు వెలిగిస్తున్న ఫోటోలు.. ఆమె నడిచి వెళుతోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.