తెలుగులో ఎవరైనా బాగా పాపులర్ రావాలంటే బిగ్ బాస్ షోను ఆశ్రయిస్తున్నారు. బిగ్ బాస్ లోపలికి వెళ్లి వచ్చిన వారికి బయట సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ దక్కుతుంది. అలాగే బుల్లితెరతో పాటు వెండితరపై కూడా ఎక్కువ ఛాన్సులు సొంతం చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ 7లో అదిరిపోయే కంటెస్టెంట్లతో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షో లో ఉన్న కంటెస్టెంట్లలో కచ్చితంగా ఫేవరెట్ అనుకున్న వారిలో రతిక ఒకరు.
మొదటి వారంలో తన అద్భుతమైన ఆటతో నాగార్జున సైతం ప్రశంసించేలా చేసింది. అయితే రెండో వారం నుంచి అనూహ్యంగా రతిక గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నాలుగో వారం వచ్చేసరికి ఆమె పూర్తిగా జీరో అయ్యి ఎలిమినేట్ అయింది. ఒకానొక దశలో కచ్చితంగా ఫేవరెట్ అనుకున్న రతిక నాలుగో వారంలోనే ఎలిమినేట్ అవ్వడంతో ఆమె అభిమానులతో పాటు చాలామంది కుర్ర కారు హృదయాలను సైతం బద్దలు కొట్టేలా చేసింది. అయితే రతిక ఆటతీరు ప్రేక్షకులకు చాలా కన్నింగ్‌గా అనిపించడం వల్ల ఆమెకు నాలుగో వారం వచ్చేసరికి ప్రేక్షకదారణ పూర్తిగా పడిపోయింది అనేది చాలామంది అభిప్రాయం.
రతిక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ఆమె పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి కానీ చదువుల సరస్వతి. ఈమెకి తెలంగాణ ఎంసెట్లో 100 లోపు ర్యాంకు వచ్చింది. ఇది గమనించిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి తన కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చి హాస్టల్ లో ఫీజు లేకుండా ఆమె చదువుకు సాయం చేశారు. అంతేకాదు రతికాకి కావలసిన అవసరాలన్నీ కూడా మల్లారెడ్డి తీర్చేవారట. అలా చదువు పూర్తయ్యాక రతికకి సినిమా ఇండస్ట్రీపై మనసు మళ్ళింది. ఇండస్ట్రీలో ఎలా ? అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలని కసితో అడిగుపెట్టిన రతికకి తొలుత ఈటీవీలో పటాస్ ప్రోగ్రాం లో స్టాండ్ అప్ కమెడియన్‌గా చేసే అవకాశం దక్కింది.
రతిక అసలు పేరు ప్రియాంక. పటాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రతికా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు సొంతం చేసుకుంది. కళ్యాణ్రామ్ అమీగోస్ సినిమాలో ఒక హీరోయిన్గా నటించిన తర్వాతే ఆమెకు కాస్త గుర్తింపు లభించింది. అలా వచ్చిన గుర్తింపుతోనే రతిక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అయితే నాలుగు వారాలకే హౌస్ నుంచి ఆమె వెళ్లిపోయిన ఈ రియాలిటీ షో ద్వారా కొట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇప్పటినుంచి అయినా రతికాకు పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.