Newsమ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో బిగ్‌బాస్ అశ్విని... ఏ సినిమాయో తెలుసా..!

మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో బిగ్‌బాస్ అశ్విని… ఏ సినిమాయో తెలుసా..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్లోకి ఎంటర్ అయింది. ఈ షోపై ఎన్నో విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే తాజా సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసింది. ఎప్పుడు ఏం ? ట్విస్ట్ ఇస్తాడో అని జనాలు కూడా ఉత్కంఠతో ఉన్నారు. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త మోఖాలని కూడా హౌస్ లోకి తీసుకువచ్చారు. అందులో బిగ్ బాస్ అశ్విని ఒకరు. ఈ అమ్మడు గురించి చాలామందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు సినిమాల‌లో కూడా నటించింది.

అశ్విని అక్టోబర్ 8వ తేదీన వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోప‌ల‌కు ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ అశ్విని ఎవరు ?ఏంటి అన్నదానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చింగ్ చేస్తున్నారు. అశ్విని ఇదివరకే తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అశ్వినికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా హాట్‌ టాపిక్ అవుతోంది.

ఈ అమ్మడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించింది అట. ఎస్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలో కీలకపాత్రలో అశ్విని నటించింది. మహేష్ బాబు – రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవరు సినిమాలో రష్మిక రెండో అక్క పాత్రలో అశ్విని నటించింది. అశ్విని ట్రైన్ లో జరిగే సన్నివేశాలలో కీలక పాత్ర పోషిస్తూ తన నటనతో ప్రేక్షకులను నవ్వించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అశ్విని తరచూ తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోష‌ల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అశ్విని సొంతం. అందువల్లే ఆమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. మరి వైల్డ్‌కార్డ్‌ ద్వారా హౌస్ లోకి వచ్చిన అశ్వినిని ప్రేక్షకులు ఎంతవరకు తీసుకు వెళ‌తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news