బాలీవుడ్ బిగ్ బి.. నటుడు అమితాబచ్చన్ దేశవ్యాప్తంగా నాలుగు దశాబ్దాలలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు .1970లో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాదిలోను స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలో నటించారు. అమితాబ్ పూర్తి పేరు అమితాబ్ హరి వంశరాయ్ బచ్చన్ కాగా.. 1970లలో రిలీజ్ అయిన జంజీర్ – దీవార్ సినిమాలతో దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
అమితాబ్ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగరాజ్‌లో అక్టోబర్ 11, 1942లో జన్మించారు. తాజాగా ఆయన 81వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ బాలీవుడ్ స్టార్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తన సినీ కెరీర్‌లో అమితాబ్ ఎన్ని కోట్లు సంపాదించారు తెలిస్తే ఆశ్చర్యపోతాం. కేవలం 500 రూపాయలు జీతంతో తన కెరీర్ ప్రారంభించిన ఆయన 40 ఏళ్లకు పైగా ఎన్నో సినిమాలలో నటించారు. అమితాబ్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తులు దాదాపు నాలుగు వేల కోట్లకు పైగానే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అమితాబ్ ఒక సినిమాలో నటించడానికి 6 నుంచి 10 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. వ్యాపార ప్రకటనలకు అయితే ఐదు నుంచి 6 కోట్లు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు స్టార్టప్ వ్యాపారాలలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సినిమాలు.. ప్రకటనల ద్వారా ఏడాదికి దాదాపు 60 కోట్ల వరకు సంపాదిస్తున్నారు..
ఆయనకు ముంబైలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జుహూలో జల్సా అనే బంగాళాలో నివసిస్తున్నారు. ఈ నివాసం విలువ 150 కోట్లు ఉంటుంది. ఇవి కాకుండా ముంబైలోనే ఐదారు బంగ్లాలు ఉన్నాయి. వీటి విలువ సైతం కోట్లలోనే ఉంటుంది. అమితాబ్ దగ్గర ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీకార్లు ఉన్నాయి. లెక్సస్ – రోల్స్ రాయిష్ – బిఎండబ్ల్యూ – మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ బ్రాండ్స్ తో పాటు 15 పైగా ఖరీదైన కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. రు. 270 కోట్లు విలువ చేసే ప్రత్యేకమైన స్పెషల్ జెట్ ఫ్లెయిట్ కూడా ఉంది. ప్రస్తుతం అమితాబ్ తెలుగులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాతో పాటు హిందీలో గణపత్ సినిమాలోని నటిస్తున్నారు.