Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' TL ప్రి రివ్యూ & రేటింగ్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ TL ప్రి రివ్యూ & రేటింగ్ అంచ‌నా

బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
టైటిల్‌: భ‌గ‌వంత్ కేస‌రి
నటీనటులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల‌, అర్జున్ రామ్‌పాల్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: సీ. రామ్‌ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్ ఎస్‌.ఎస్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
యాక్ష‌న్‌: వి. వెంక‌ట్‌
ఎగ్జిగ్యూటివ్ నిర్మాత‌: ఎస్‌. కృష్ణ‌
నిర్మాతలు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
దర్శకుడు : అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్‌: 19 అక్టోబ‌ర్‌, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 163 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్‌: రు. 110 కోట్లు

TL ప‌రిచ‌యం :
బాల‌య్య క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బాలయ్య సినిమా వస్తుంది అంటే అభిమానులు హంగామాతప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ పట్టించుకునేవారు కాదు. అఖండకు ముందు బాలయ్య క్రేజ్ వేరు.. అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ వేరు. అఖండ దెబ్బతో థియేటర్లలో అఖండ గర్జన మోగించి.. వీరసింహారెడ్డితో థియేటర్లలో వీర విహారం చేసేసాడు బాలయ్య. ఇటు బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్ షో తో దుమ్ము దులిపేశాడు. బాలయ్యకు ఒక బ్లాక్ బస్టర్ రావడానికి చాలా ఏళ్లు పట్టేది.. అలాంటిది ఇప్పుడు ఏకంగా రెండు వరుస బ్లాక్‌బ‌స్ట‌ర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి తన కామెడీ స్టైల్ కు భిన్నంగా బాలయ్య లాంటి యాక్షన్ హీరోతో చాలా డిఫరెంట్‌గా భగవంత్‌ కేసరి సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. భారీ అంచనాలు భారీ ఆశలతో ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఎలా ?ఉండబోతుందో TL ప్రి రివ్యూలో చూద్దాం.

క‌థ అంచ‌నా.. !
ఇది తండ్రీ, కూతుర్ల మధ్య భావోద్వేగంతో సాగే కథ అని తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు అనిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. బాలయ్యకు కూతురు పాత్రలో నటించిన శ్రీలీలకు మధ్య వచ్చే ప్రేమ ఆప్యాయత.. అనురాగంతో పాటు కూడిన సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. తన కుమార్తెను ఒక తండ్రి ఆర్మీలో ఎందుకు ? జాయిన్ చేయాలని అనుకున్నాడు. దీని వెనుక ఉన్న మిషన్ ఏంటి? ఆర్మీలో జాయిన్ కావడం తనకు ఇష్టం లేకపోయినా తండ్రి ఎంత టార్చర్ పెట్టినా కూతురు ఏం చేసింది ? అన్నది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఇక హీరోయిన్ కాజల్.. బాలయ్య మధ్య వయసులో ప్రేమలో పడే పాత్రలలో కనిపిస్తారు.. వీరిద్దరి స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో రానుంది.. ఇక ఈ కథకు విలన్ అర్జున్ రాంపాల్ కు ఉన్న లింక్ ఏంటి అన్నది ? తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే..!

విశ్లేష‌ణ అంచ‌నా :
భగవంత్‌ కేసరి సినిమా ఖచ్చితంగా చాలా కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో పాటు టీజర్లు, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మామూలుగా బాలయ్య యాక్షన్ హీరో.. బాలయ్య మాస్ జనాలకు బాగా నచ్చేస్తాడు.. బాలయ్య విలన్లను చితక్క కొట్టుడు కొడుతుంటే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అఖండలో సెకండాఫ్ లో సినిమా అంతా బాలయ్య ఉన్న అందరి హీరోల అభిమానులు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇటు అనిల్ రావిపూడి బాలయ్య స్టైల్ కు పూర్తిగా భిన్నమైన డైరెక్టర్. అనిల్ రావిపూడి అంటేనే కామెడీని నమ్ముకుని సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతూ ఉంటాడు.

అనిల్ గత సినిమాలు చూస్తుంటేనే అతడు స్టైల్ ఏమిటో తెలిసిపోతుంది. అలా రెండు భిన్న ధ్రువాలకు చెందిన వీరిద్దరూ కలిసి సరికొత్తగా తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా మెయిన్ స్టోరీ అంత కథ మీదే నడుస్తుంది. ప్లో దెబ్బ తినకుండా ఉండేందుకు సినిమాలో పాటలు, డ్యూయెట్లు కూడా లేవు. బాలయ్య మంగమ్మ గారి మనవడు సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ దంచవే మేనత్త కూతురా సాంగ్ రీమిక్స్ చేసినా దానిని వారం రోజుల త‌ర్వాత ద‌స‌రా రోజు నుంచి మాత్ర‌మే సినిమాలో యాడ్ చేస్తున్నారు.

అలాగే సినిమాలో ఏకంగా ఏడెనిమిది ఫైట్లు ఉన్నాయి. ఐదు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు. ఇవే సినిమాకు బ‌లం. దీనికి తోడు బాల‌య్య చెప్పిన డైలాగులు కూడా మోత మోగిపోనున్నాయి. టోట‌ల్‌గా చూస్తుంటే ఈ సినిమా బాల‌య్య కెరీర్ లో చానా యేళ్లు యాదుంటుంది అన్న‌ట్టు సిగ్న‌ల్స్ వ‌చ్చేస్తున్నాయి. ఏదేమైనా సినిమాలో కావాల్సినంత యాక్ష‌న్ ఉండ‌బోతోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ అంచ‌నా :
న‌టీన‌టుల్లో బాల‌య్య గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం స‌రికొత్త బాల‌య్య‌ను చూస్తున్నాం. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా బాల‌య్యను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని క్యారెక్ట‌ర్లో చూడ‌బోతున్నాం అని సంకేతాలు ఇచ్చేశాయి. బాల‌య్య ఈ సినిమాలో ఫ‌స్ట్ టైం పూర్తిగా తెలంగాణ మాండ‌లికంలో డైలాగులు చెప్ప‌బోతున్నాడు. ఫైట్లు కూడా కొత్త‌గా ఉండ‌డంతో పాటు న‌డి వ‌య‌స్సులో ఉన్న వ్య‌క్తి.. అందులోనూ జైలు శిక్ష అనుభ‌వించి బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌డి మ‌న‌స్తత్వం ఎలా ఉండ‌బోతోంది ఇవ‌న్నీ విన‌డానికే కాదు.. చూడ‌డానికి కూడా కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

శ్రీలీల ఇప్ప‌టి వ‌ర‌కు చేస్తోన్న రొమాంటిక్‌, గ్లామ‌ర్ సినిమాల‌కు భిన్నంగా బాల‌య్య కూతురు పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఇటు అల్ల‌రి పిల్ల‌గాను, అటు మొండిఘ‌టంగాను.. తండ్రి మాట విన‌కుండా బెట్టు చేసే పాత్ర‌లోనూ, ఇటు చివ‌ర్లో ఎమోష‌న‌ల్‌గా ర‌క‌ర‌కాల యాంగిల్స్‌లో శ్రీలీల పాత్ర‌కు స్కోప్ ఉంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌ధ్య వ‌య‌స్సులో ఉంటూ బాల‌య్య‌తో ప్రేమ‌లో ప‌డే మెచ్యూర్డ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. బాల‌య్య – కాజ‌ల్ ప్రేమ‌లో ప‌న్నీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ట‌. ఇక అర్జున్ రామ్‌పాల్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా బాల‌య్య‌ను ఢీ కొడుతున్నాడు. గ‌తంలో బాల‌య్య ఫ్యాక్ష‌న్ విల‌న్ల‌ను ఢీ కొట్ట‌గా… ఇందులో అర్జున్ పాత్ర కొత్త‌గా ఉండనుంది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు అంచ‌నా :
ఇక టెక్నిక‌ల్‌గా సీ రామ్‌ప్ర‌సాద్ బాల‌య్య‌కు క‌లిసొచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్‌.. బాల‌య్య‌ను ఎలా ఏ యాంగిల్లో చూపించాలో రామ్‌ప్ర‌సాద్‌కు తెలిసిన‌ట్టుగా మ‌రెవ్వ‌రికి తెలియ‌దు. మామూలుగానే మ్యూజిక్‌తో పూన‌కాలు తెప్పిస్తోన్న థ‌మ‌న్ అఖండ‌, వీర‌సింహారెడ్డికి అద‌ర‌గొట్టేశాడు. ఈ సినిమాకు అనిల్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డంతో మ‌రింత‌గా విజృంభించాడంటున్నారు. ఇక వెంక‌ట్ యాక్ష‌న్ స‌రికొత్త‌గా ఉండ‌నుంద‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో ఫైట్లే చెప్పేశాయి. ఇక ర‌న్ టైం 160 నిమిషాలుగా ఉండ‌డంతో క్రిస్పీగానే సినిమా ఉండ‌నుంద‌ని క్లారిటీ ఉంది. బాల‌య్య గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే ఇది త‌క్కువ ర‌న్ టైం. ఇక షైన్ స్క్రీన్ నిర్మాణ విలువ‌లు చాలా ఉన్నంత‌గా ఉండ‌బోతున్నాయి. బాల‌య్య కెరీర్‌లో ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల బ‌డ్జెట్ పెట్టిన సినిమా ఇదే. సినిమాలో రిచ్ విజువ‌ల్స్‌కు కొర‌త ఉండ‌ద‌నే చెప్పాలి.

ఫైన‌ల్‌గా…
అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత బాల‌య్య.. అటు ఆరు వ‌రుస సూప‌ర్ హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడి క‌లిసి చేసిన భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు రు.110 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ద‌స‌రాకు గ‌ట్టి కాంపిటేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా హిట్ అయితే బాల‌య్య కెరీర్‌లో చాలా యేళ్ల త‌ర్వాత హ్యాట్రిక్ హిట్లు వ‌చ్చిన రికార్డ్ చేరుతుంది. ఈ సినిమా హిట్ అయితే అనిల్ రావిపూడికి అస‌లు తిరుగే ఉండ‌దు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ తెలుగులైవ్స్‌.కామ్ భ‌గ‌వంత్ కేస‌రి టీంకు, ఇటు నంద‌మూరి, బాల‌య్య బాబు అభిమానుల‌కు ముంద‌స్తుగా శుభాకాంక్ష‌లు చెపుతోంది.

రేటింగ్‌: బాల‌య్య మార్క్ యాక్ష‌న్ + అనిల్ రావిపూడి టేకింగ్ తెర‌మీద చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయితే
ఈ సినిమా రేటింగ్ 3 – 3.5 రేంజ్‌లో ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి..

  • వుయ్యూరు శుభాష్‌
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news