టాలీవుడ్ లో ఈ దసరాకు మూడు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ డబ్బింగ్ సినిమా లియో పోకోటాపోటీగా బాక్సాఫీస్ బరిలో దిగాయి. అయితే థియేటర్ కౌంట్ విషయంలో బాలయ్య, విజయ్ సినిమాలకు కాస్త ఎడ్జ్ కనపడింది. టైగర్ నాగేశ్వరరావు తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. రెండో రోజు టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఎక్కువ థియేటర్లు రాలేదు.
అయితే విజయ్ లియో సినిమాకు తొలి రోజు అబ్బో సూపర్ అన్న టాక్ వచ్చినా మూడు రోజుల తర్వాత లియో తెలుగులో తేలిపోయింది. ఈ సినిమాకు తెలుగులో రు. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండడంతో చాలా సులువుగానే అయింది. తొలి మూడు రోజులు ఏ సెంటర్లలో బాలయ్య, రవితేజ సినిమాల కంటే లియో సినిమాకే ఎక్కువ వసూళ్లు కనిపించాయి. లియో నాలుగో రోజు నుంచి ఈ సినిమా పూర్తిగా డ్రాప్ అయింది. అదే టైంలో రవితేజ సినిమా పుంజుకుంది.
ఇక బాలయ్య సినిమా తొలి రోజు బాలయ్య గత సినిమాలతో పోల్చుకుంటే తక్కువ వసూళ్లు రాబట్టినా మూడు నాలుగు రోజుల నుంచి బాగా పికప్ అయ్యింది. ఇప్పటికే ఈ మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చి 11 రోజులు దాటేసింది. విజయ్ లియో 20 కోట్ల లోపు షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలిచింది. ఇక భగవంత్ కేసరి సినిమా రు. 135 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి ఎంటర్ అయింది.
అనూహ్యంగా దసరా సెలవుల్లో రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా ఆ సినిమాకు వచ్చిన టాక్ కంటే బాగానే పెర్పామ్ చేసి రు. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. భగవంత్ కేసరి, లియో ఇప్పటికే లాభాలు కళ్ల చూస్తుండగా.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మాత్రం ఓ మోస్తరు నష్టాలతో బయటపడనుంది.