బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తుంది. భగవంత్ కేసరి ఈ నెల 19న థియేటర్లలోకి దిగుతుంది. సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అటు కాజల్ హీరోయిన్.. ఇటు శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి గత సినిమాలకు భిన్నంగా తెరకెక్కినట్టు ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో పాటలు ఉండవు. స్టోరీ డిమాండ్ చేయలేదు.. కాబట్టి బాలయ్యతో డ్యూయెట్స్ ఆశించొద్దు.. చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా వెళ్లామంటూ క్లారిటీ ఇచ్చేశారు.
చివర్లో మాత్రం సిచ్యువేషన్ సాంగ్ పెట్టాం.. అది అలా కుదిరింది కాబట్టి పెట్టాం అని అనిల్ రావిపూడి చెప్పారు. ఇందులోనూ మరో ట్విస్ట్ కూడా ఉంది. విడుదలైన మొదటి వారం ఆ సాంగ్ ఉండదు.. రెండో వారం నుంచి మాత్రమే ఆ సాంగ్ థియేటర్లలో యాడ్ చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఆ సాంగ్ ఏదో కాదు బాలయ్య మంగమ్మ గారి మనవడు సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయిన దంచవే మేనత్త కూతురా సాంగ్. ఈ సాంగ్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు.
మొదటివారం నిజాయితీగా సినిమా చూద్దాం.. రెండో వారం దసరా నుంచి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అనిల్ రావిపూడి చెప్పేశారు. అంటే ఆ పాట కోసం సినిమాను రెండోసారి చూడటానికి ప్రేక్షకులంతా ప్రిపేర్ అవ్వాలని చెబుతున్నాడు అనిల్ రావిపూడి. అంటే సినిమా కథ చెప్పుతున్నప్పుడు ప్లో దెబ్బకూడదని అలా చేసినట్టు ఆయన చెబుతున్నారు.
తాము భగవంత్ కేసరి వరల్డ్ సృష్టించాము.. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్లి పోతారు.. అలాంటి టైంలో బలవంతంగా పాట పెట్టాలని నాకు అనిపించలేదు.. చివర్లో సిచువేషన్ సాంగ్ కుదిరింది.. అంతా ఓసారి చూసుకున్నాక సినిమా ప్లో దెబ్బతింటుందని తానే పాటను పక్కన పెట్టినట్టు అనిల్ రావిపూడి చెప్పారు.
అయితే దసరా నుంచి ఈ పాటను యాడ్ చేస్తామని చెప్పారు. ఇక బాలయ్య – కాజల్ లవ్ ట్రాక్ కూడా కృతకంగా ఉండదని చాలా నేచురల్ గా ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికి తెలిపారు. ఓ పెద్దమనిషి.. పెద్దమ్మాయి కలిసి తమ అనుబంధాన్ని ఎలా షేర్ చేసుకుంటారో ? అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఏది ఏమైనా అనిల్ రావిపూడి చాలా సరికొత్తగా ఉండబోతుందని క్లియర్ కట్ గా తెలుస్తోంది.