Newsబుక్ మై షోలో ' భ‌గ‌వంత్ కేస‌రి ' మ్యానియా... బాల‌య్యా...

బుక్ మై షోలో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ మ్యానియా… బాల‌య్యా మ‌జాకానా…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. టాలీవుడ్ యంగ్‌, టాలెంటెడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఈ యాక్ష‌న్ డ్రామా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు రిలీజ్ అయిన రెండు పాట‌లు దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌కు కూడా ముహూర్తం పెట్టేశారు. ఈ నెల 8న ట్రైల‌ర్ రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రి బుకింగ్స్ అమెరికాలో అలా స్టార్ట్ అయ్యాయో లేదో దుమ్ము దులుపుతూ అమ్ముడ‌వుతున్నాయి. ఇక బుక్ మై షో యాప్‌లో అయితే ఈ సినిమా 1.23 ల‌క్ష‌ల లైక్స్‌, ఇంట్ర‌స్టింగ్స్ న‌మోదు చేసింది.

దీనిని బ‌ట్టే భగవంత్ కేసరి కోసం ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది. ఈ సినిమాకు థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా… షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రు. 110 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో బాల‌య్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జ‌రుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news