News' భగవంత్ కేసరి ' బ్లాక్ బస్టర్ స‌క్సెస్ టూర్ డీటైల్స్‌......

‘ భగవంత్ కేసరి ‘ బ్లాక్ బస్టర్ స‌క్సెస్ టూర్ డీటైల్స్‌… ఏ ఊర్లో ఎప్పుడు అంటే…!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమాలో నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ పవర్ఫుల్ గా అదరగొట్టగా.. ఆయన కూతురు పాత్రలో యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా నటించారు. నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తొలివారం ముగిసేసరికి బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ .112 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ సాధించి సూపర్ హిట్ అయింది. తమకు ఇంత మంచి విజయాన్ని అందించిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ షేర్ కా టూర్‌ ప్లాన్ చేశారు. ఈ టూర్ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు.

ముందుగా అక్టోబర్ 27న ప్రారంభం కానున్న ఈ టూర్‌లో వైజాగ్ లోని మెలోడీ థియేటర్లో మార్నింగ్ టైంలో ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ తర్వాత రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో భగవంత్ కేసరి ఆడుతున్న థియేటర్లను ఈ టీం సందర్శిస్తుంది. అక్క‌డ ప్రేక్ష‌కుల‌తో ఇంట‌రాక్ట్ అవుతుంది. అక్టోబర్ 28న విజయవాడ దుర్గమ్మ గుడి దర్శనం అనంతరం అక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.

అనంతరం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప చేరుకుంటారు మొత్తంగా ఈ టూర్ ఫ్యాన్స్ లో అటు ఆడియన్స్ లో కన్నుల పండుగలా సాగనుంది. ఈ టూర్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల తో పాటు పలువురు యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రమోషనల్ టూర్ తో భగవంత్ కేసరి వసూళ్లు మరింత స్ట్రాంగ్ అవనున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news