News' భ‌గ‌వంత్ కేస‌రి ' ఫైట్లు ఇలా ఉంటాయా... థియేట‌ర్ల‌లో విజిల్స్‌కు...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఫైట్లు ఇలా ఉంటాయా… థియేట‌ర్ల‌లో విజిల్స్‌కు నో బ్రేక్‌… మోత మోగాల్సిందే..!

భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. ఈ సినిమా అటు బాలయ్య లేదా ఇటు అనిల్ రావిపూడి రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండ‌దని చెబుతూ వస్తున్నారు. బాలయ్య – శ్రీలీల‌ ఎమోషనల్ బాండింగ్ మీద ఈ సినిమా ఎక్కువ ఫోకస్ అవుతుందని చెప్తున్నారు. పైగా సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఉన్నా.. బాలయ్యకు – కాజల్‌ మధ్య సాంగ్స్ లేవు.. డ్యూయెట్లు లేవు.. ఇలా అయితే బాలయ్య అభిమానులు ఎలా రిసీవ్ ? చేసుకుంటారు అన్న అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.

అసలు విషయం ఏంటంటే సినిమాలో ఎంత కొత్త జాన‌ర్ ఉన్నా కూడా సినిమాలో మొత్తం 7 ఫైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఐదు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. సినిమా స్టార్టింగ్ లో జైలులో ఒకటి.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మరొకటి అదిరిపోయే ఫైట్లు చిత్రీకరించారట. అలాగే సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఒక ఫైట్ – ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒకటి – క్లైమాక్స్‌లో ఒక భారీ ఫైట్ ఉంటాయని తెలుస్తుంది.

మొత్తం ఏడు ఫైట్లు… అందులోనూ ఐదు భారీ ఫైట్లు ఉన్నాయంటే థియేట‌ర్ల‌లో సినిమా చూస్తుంటే విజిల్స్ మోత మోగిపోవాల్సిందే.. అందులో ఎలాంటి డౌట్లు అక్క‌ర్లేదు. బాల‌య్య ఫ్యాన్స్‌కు, మాస్ ఫ్యాన్స్‌కు మాంచి విందు భోజ‌న‌మే ఈ భ‌గ‌వంత్ కేస‌రి సినిమా. మొత్తం మీద ఎమోషనల్ సీన్లు + యాక్షన్ సీన్లు కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లే తయారు చేసుకున్నారట.

ఇప్పటివరకు సినిమాలో డ్యూయెట్లు లేవు.. పాటలు లేవు. ఇది కమర్షియల్ సినిమాగా ఉండదని బాలయ్య ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ మొత్తం తొలగిపోయింది. భగవంత్ కేసరి ఓవ‌రాల్‌గా బాలయ్య స్టైల్ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కాగా క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 19న థియేటర్లలో బాల‌య్య‌ నట విశ్వరూపం చూడటం ఒక్కటే మిగిలి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news