సినిమాకు ఎక్కువ రన్ టైం అనేది కత్తికి రెండు వైపులా ఉన్న పదును లాంటిది. సినిమా బాగుంటే ఓకే.. సినిమా ఎంత రన్ టైమ్ ఉన్నా చూస్తారు.. ఏమాత్రం తేడా కొట్టిన భారీ నిడివి కారణంగా మొదటికే మోసం వచ్చేస్తుంది. అస్సలు ఆ సినిమా వైపే చూడరు. ముఖ్యంగా పండగ పూట థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో పెద్ద రన్ టైం అనేది మరింత రిస్క్ తో కూడిన విషయం. ఇప్పటికే ఎన్నో రిస్కులు ఫేస్ చేస్తోంది రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా..!
ఇప్పుడు ఈ సినిమా నిడివి విషయంలో కూడా అదే రిస్క్ కనిపిస్తోంది. దసరా బరిలో ఉన్న మూడు పెద్ద సినిమాలలో భారీ రన్ టైమ్ తో వస్తున్న సినిమా ఇది ఒక్కటే. ఈ విషయంలో బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు చాలా ప్లస్. ఈ సినిమా రన్ టైం 155 నిమిషాలు. ఇది చాలా పర్ఫెక్ట్ డీసెంట్ రన్ టైం. సినిమా క్రిస్పీగా ఉంది. ఇక డబ్బింగ్ సినిమా విజయ్ లియో రన్ టైమ్ 164 నిమిషాలు.. కంటెంట్ బాగుంటే అది కూడా పెద్ద ఎక్కువ కాదని చెప్పాలి.
ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా నిడివి ఏకంగా 181 నిమిషాలు.. అంటే మూడు గంటల మీద ఒక నిమిషం ఎక్కువ. తెలుగు ఆడియన్స్ కు మూడు గంటల సినిమాలు కొత్త కాదు.. మహానటి – అర్జున్ రెడ్డి – భరత్ అనే నేను ఆ మాటకు వస్తే సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య – వీరసింహారెడ్డి సినిమాల రన్ టైం కూడా 170 నిమిషాలు పైనే.. కంటెంట్ బాగుండడంతో ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి .
అదే టైంలో సంక్రాంతికి వచ్చిన విజయ్ వారసుడు సినిమా రన్ టైం రెండు గంటల యాభై నిమిషాలు. ఈ సినిమా రిజల్ట్ తెలిసిందే. ఆది పురుష్ – అంటే సుందరానికి సినిమాల నిడివి కూడా ఎక్కువే. సినిమా కాస్త యావరేజ్ గా ఉన్న రన్ టైం ఎక్కువ ఉంటే అది కూడా మైనస్ అవుతుంది. ఏది ఏమైనా మూడు గంటల రన్ టైం అంటే రవితేజ పెద్ద రిస్క్ తో థియేటర్లలోకి వస్తున్నట్టే..! అందులో పండగ పూట అంత ఓపికగా ప్రేక్షకులు సినిమా చూస్తారా అన్నది కూడా సందేహంగానే కనిపిస్తోంది.