బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా గర్జనకు రెడీ అయింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ భగవంత్ కేసరి రిలీజ్ అయింది. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. టోటల్ వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుని రు. 68 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే టోటల్గా రు. 130 నుంచి 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది.
పైగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాతో పాటు మాస్ మహారాజ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాల మధ్యలో గట్టి పోటీలో భగవంత్ కేసరి రిలీజ్ అవుతుంది. ట్రయాంగిల్ ఫైట్ లో రిలీజ్ అవుతున్న భగవంత్ కేసరి సినిమాకు భారీగానే థియేటర్లు దక్కాయి. నైజాంలో కన్ఫర్మ్ అయిన థియేటర్స్ కౌంట్ 285 నుంచి 300 వరకు ఉండగా… సీడెడ్‌లో లో 200 పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఓవరాల్ గా ఈ సినిమా రిలీజ్ థియేటర్స్ కౌంట్ లెక్కలు చూస్తే నైజాంలో 285 నుంచి 300 – సీడెడ్‌లో 200 – ఆంధ్రాలో 400 – ఓవరాల్ గా ఏపీ + తెలంగాణలో 900 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. ఓవర్సీస్ లో 350 థియేటర్లలో రిలీజ్ చేశారు.
టోటల్ వరల్డ్ వైడ్ గా 1400 థియేటర్లలో భగవంత్ కేసరి రిలీజ్ కానుంది. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి ఈ థియేటర్లో పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అయితే సినిమాకు కావలసింది ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే.. ఒక్కసారి టాక్ అదిరిపోయేలా వస్తే కలెక్షన్లు పెరగడంతో పాటు మిగిలిన రెండు సినిమాల టాక్‌ను బట్టి భగవంత్ కేసరికి థియేటర్లు పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి.