News' భ‌గ‌వంత్ కేస‌రి ' 6 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ 6 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ & షేర్‌… బాల‌య్య‌కు హ్యాట్రిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌..

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా… దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెర‌కెక్కిన సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. బాల‌య్య అఖండ‌తో పాటు ఈ యేడాది సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టారు. తాజాగా భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు.

ఈ సినిమా రిలీజ్ డే నాడు కొంద‌రు మిక్స్ డ్ టాక్ చెప్పారు. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా అంచ‌నాల‌కు మించి పుంజుకుంది. తొలి రోజు కంటే 4,5 రోజుల్లో ఎక్కువ షేర్ వ‌చ్చింది. ఇక ఆరు రోజులు పూర్త‌య్యే స‌రికి ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 104 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో బాల‌య్య వ‌రుస‌గా మూడు సెంచ‌రీలు కొట్టేశారు.

అటు ఓవ‌ర్సీస్‌లో కూడా వ‌రుస‌గా మూడు మిలియ‌న్ డాల‌ర్ల సినిమాలు ఉన్న ఏకైక హీరోగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అలాగే రు. 104 కోట్ల గ్రాస్‌తో పాటు రు. 52 కోట్ల షేర్ కొల్ల‌గొట్టిన ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర్లో ఉంది. ఇక భ‌గ‌వంత్ కేస‌రి 6 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 12.7 కోట్లు
సీడెడ్ – 10.9 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.8cr
గుంటూరు – 5.1 కోట్లు
కృష్ణ – 2.6 కోట్లు
నెల్లూరు – 1.8 కోట్లు
ఈస్ట్‌ – 2.4 కోట్లు
వెస్ట్ – 2.2 కోట్లు
కర్ణాటక – 3.8 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.5 కోట్లు

ఓవర్సీస్ – 6 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 51.8 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news