నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత బాలయ్య నటించిన సినిమా భగవంత్ కేసరి. బాలయ్య స్టైల్ కు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది.
తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా సెకండ్ వీక్‌లోకి అడుగు పెట్టింది. తొలి వారంలో దాదాపు 35 కోట్లకు కలెక్షన్లతో రు. 55 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్యకు జోడిగా సీనియర్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్యకు కూతురు పాత్రలో.. బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు.
హరీష్ పెద్ది – సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మ్యూజికల్ సెన్షేషన్ థమన్ సంగీతం అందించారు. విచిత్రం ఏంటంటే భగవంత్ కేసరీ సినిమాకు తొలి రోజు అనుకున్న స్థాయిలో టాక్ రాలేదు. చాలామంది మిక్స్‌డ్ టాక్ అని చెప్పారు. అయితే అనూహ్యంగా రెండో రోజు నుంచి పుంజుకుని బాక్సాఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాకు మరో రెండు వారాలపాటు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. తమిళ హీరో విజయ్ లియో సినిమాకు తెలుగులో హంగామా మాత్రమే కనిపించింది. ఈ సినిమా తెలుగులో కనీసం రు. 20 కోట్ల షేర్ కూడా రాలేదు. లియో పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు తిరుగులేకుండా పోయింది.