బెల్లంకొండ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిస్థితి ఉట్టికి ఎగరలేను… స్వర్గానికి ఎగురుతా అన్న చందంగా కనిపిస్తోంది. తెలుగులోనే బెల్లంకొండకు సరైన విజయాలు లేవు. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ చేసిన అన్ని సినిమాలు ప్లాపులు అవుతున్నాయి. ఈ క్రమంలో అప్పుడెప్పుడో రాజమౌళి – రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు.
అది కూడా తెలుగులో ఫెయిడౌట్ అయ్యి అందరూ మర్చిపోయిన వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అవడంతో పాటు కనీసం 50 లక్షలు కూడా వసూలు చేయలేదు. ఈ సినిమా దెబ్బతో నిర్మాతలు నిండా మునిగిపోయారు. బెల్లంకొండ పరువు అంతా గంగలో కలిసిపోయింది. దీంతో కాస్త గ్యాప్ తర్వాత సాయి శ్రీనివాస్, భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్ర కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవల పట్టాలు ఎక్కింది.
ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఓ షెడ్యూల్ కూడా జరిగింది. భీమ్లానాయక్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు సాగర్ చంద్రకు ఎవరు ఛాన్సులు ఇవ్వడం లేదు. ఈ టైంలో బెల్లంకొండ పిలిచి ఛాన్స్ ఇవ్వడంతో సాగరచంద్ర ఆనందానికి అవధులు లేవు. అయితే ఇప్పుడు ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 30 నుంచి మొదలవుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ?ఉందో ఎవరికి అర్థం కావటం లేదు. ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా తిరిగి పట్టాలు ఎక్కితేనే సాగర్ చంద్రకు కాస్త ఉపశమనం వచ్చినట్టే… లేకపోతే సాగర్ కె. చంద్రకు ఇది పెద్ద షాకే.