News' భ‌గ‌వంత్ కేస‌రి ' తో ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సెన్షేష‌న‌ల్ రికార్డ్‌.....

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ తో ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సెన్షేష‌న‌ల్ రికార్డ్‌.. న‌ట‌సింహ‌మా మ‌జాకానా..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ అఖండ – వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్‌ చేశారో తెలిసిందే. రెండు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో బాలయ్య దెబ్బతో టాలీవుడ్ మొత్తం షేక్ అయింది. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్‌లో సులువుగా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించాయి. ఇక భగవంత్‌ కేసరి సినిమా విషయానికొస్తే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే ఆరు లక్షల డాలర్ల కలెక్షన్ సాధించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్యకు అఖండ సినిమా నుంచి మార్కెట్ బాగా పెరిగింది. విచిత్రం ఏంటంటే బాలయ్య సినిమాలకు ఒకప్పుడు ఓవర్సీస్ లో అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు వచ్చేవి కాదు. అలాంటిది అఖండ – వీరసింహారెడ్డి రెండు సినిమాలు అక్కడ వన్ మిలియన్ డాలర్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు భగవంత్ కేస‌రి సినిమా రిలీజ్ కు నాలుగైదు రోజు ల ముందే ఆరు లక్షల డాలర్ల ప్రీ సేల్స్ కొల్లగొట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

రిలీజ్ కు మరో నాలుగు రోజులు టైం ఉండడంతో పాటు రిలీజ్ రోజు వసూళ్లు కూడా కలుపుకుంటే చాలా సులువుగాని వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తుందని తెలుస్తోంది. సీనియర్ హీరోలలో ఓవర్సీస్ లో వ‌రుస‌గా మూడు సార్లు వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లతో బాలయ్య స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం ఖాయం. మూడు వ‌రుస వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ల‌తో ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నాడు.

ఇలాంటి రేర్ రికార్డు సీనియ‌ర్ హీరోల‌లో చిరంజీవికి, నాగార్జున, వెంకటేష్ కి కూడా లేదు. ఇక భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 19న కోలీవుడ్ హీరో విజ‌య్ లియో సినిమాకు పోటీగా బాలయ్య కేసరి థియేటర్లలోకి దిగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news