నందమూరి బాలకృష్ణ ఈ యేడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా దసరా కానుకగా అనిల్ రావిపూడి ఇప్పుడే దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేశారు. అక్టోబర్ 19 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లనో తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రభినయం చేస్తారని.. ఫ్లాష్ బ్యాక్‌లో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ బాలయ్యకు జోడిగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలయ్య వరుసగా అఖండ – వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు తనఖాతాలో వేసుకున్నారు.
అఖండ సినిమాకు ముందు వరకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎనిమిది నుంచి పది కోట్ల రేంజ్ లో ఉండేది. వీరసింహారెడ్డి సినిమాకు 12 కోట్ల రేంజ్ లో తీసుకున్నారు. ఆ సినిమా నిర్మాతలు బాలయ్యకు పట్టుబట్టి మరీ ఆ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. రెండు వరుస సూపర్ హిట్ల తర్వాత భగవంత్ కేసరి సినిమాకు రు. 16 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు చేయబోయే తన 109వ సినిమాకు 18 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలయ్యకు మామూలుగా రెమ్యూనరేషన్ పట్టింపు ఉండదు. అయితే నిర్మాతలే బాలయ్య మార్కెట్ పెరుగుతూ ఉండడంతో రు.18 కోట్ల రెమేనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మిడిల్ రేంజ్ హీరోల రెమ్యునరేషన్లే రు. 20 – 25 కోట్ల రేంజ్‌లో ఉంటున్నాయి. బలమైన మాస్ బేస్ ఉన్న బాలయ్యకు రు. 18 కోట్లు ఇవ్వడం సబబే అని చెప్పాలి.