Newsబాల‌య్య మార్కెట్ డబుల్, త్రిబుల్.. న‌ట‌సింహం మ్యాజిక్ ఇదే...!

బాల‌య్య మార్కెట్ డబుల్, త్రిబుల్.. న‌ట‌సింహం మ్యాజిక్ ఇదే…!

ప్రస్తుతం బాలకృష్ణ పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖండకు ముందు బాలకృష్ణ కెరీర్ వేరు. అఖండ తర్వాత బాలకృష్ణ కెరీర్ వేరు. ఈ విషయాన్ని ఒక్కసారి సరిపోల్చి చూసుకుంటే సింహా, లెజెండ్ సినిమాలకు అదిరిపోయేటాక్‌ వచ్చింది. ఈ రెండు సూపర్ డూపర్ హిట్లు అయినా ఆ రెండు సినిమాల కలెక్షన్లు రూ.40 కోట్ల దరిదాపుల్లో ఆగిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బాలయ్య సినిమాలకు యావరేజ్ టాక్‌ వచ్చినా కూడా సెంచరీలు కొడుతున్నారు. అసలు ఈ రేంజ్ మార్కెట్ ఆయనకు ఉన్నట్టుండి ఎలా పెరిగిందో ? తెలియక మిగిలిన హీరోలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య సినిమాలకు మ్యాక్సిమమ్‌ మార్కెట్ రూ.40 కోట్ల కంటే ఎక్కువ ఉండేదే కాదు.

అలాంటిది అది ఇప్పుడు డబుల్, త్రిబుల్‌ ఇంకా చెప్పాలంటే నాలుగు రెట్లు కూడా ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు బాలకృష్ణ సినిమా అంటే కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు. కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు అనే నానుడి ఉంది. ఇప్పుడు అది కూడా దూరమైంది. బాలయ్య సినిమా వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూక‌డుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆయన సినిమాలు చూస్తున్నారు. మరి ముఖ్యంగా యూత్.. ఇంకా చెప్పాలి అంటే ఈ తరం జనరేషన్ వాళ్ళు బాలయ్య సినిమాలు ఫస్ట్ రోజు చూడాలని తాపత్రయపడుతున్నారు.

అఖండ సినిమా నుంచి ఇది మొదలైంది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డికి యావరేజ్ టాక్‌ వచ్చింది.
అయినా బాలయ్య క్రేజ్‌ ముందు ఆ టాక్ పటాపంచలు అయిపోయింది. ఆ సినిమా కూడా ఏకంగా రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వీరసింహారెడ్డికి యావరేజ్ టాక్‌ ఉండి.. అటు చిరంజీవి లాంటి హీరో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చి.. విజయ్ – దిల్ రాజు కాంబినేషన్లో వారసుడు సినిమా పోటీలో ఉన్నా కూడా వీరసింహారెడ్డి కేవలం వారం రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేశాడు.

ఇక ఇప్పుడు రిలీజ్ అయిన భగవంత్‌ కేసరి సినిమాకు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో టాక్ రాలేదు. అయినా ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్ళు కొల్లగొట్టింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి. సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ ఒక బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది. బాలయ్య మార్కెట్ ఇంతగా పెరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆహాలో చేసిన అన్‌స్టాప‌బుల్ షో బాలయ్య ఇమేజ్ మొత్తం మార్చేసింది. ఆ షోకు ముందు బాలయ్య అంటే బాగా కోపిష్టి… సినిమాల‌లో ఉన్నట్టే బయట కూడా ఉంటాడని చాలామంది భావించారు.

అప్పుడప్పుడు స్టేజ్ మీద నోరు జారటం కూడా బాలయ్య పట్ల చాలామందిలో.. ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్‌తో పాటు కొన్ని వర్గాలలో ఆయన పట్ల నెగిటివ్ భావం పెరగడానికి కారణమైంది. కానీ ఆహా షో తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. బాలకృష్ణ అంటే నిజంగా కల్మషం లేని మనస్తత్వం ఉన్నవాడు.. బాలకృష్ణుడు అని అందరికీ అర్థమయిపోయింది. ఈ టాక్ తర్వాత బాలయ్య మార్కెట్ రెండింతలు, మూడింతలు పెరిగిందంటే అతిశయోక్తి కాదు.

అందుకే సీజన్ 1 సూపర్ హిట్ కాగా సీజన్ 2 , సీజన్ 3 కూడా మొదలుపెట్టేశారు. ఒకానొక సమయంలో ఈ షో ఇండియాలోనే నెంబర్ 1 టాక్‌ షో గా నిలిచింది. ఏది ఏమైనా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే బాలయ్య తన సినిమాలతో రాబోయే రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు కూడా ఈజీగా క్రాస్ చేస్తాడు అన్న అంచనాలు అయితే ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news