Newsబాల‌య్యా ఈ రికార్డుల గోల ఎంద‌య్యా... ' భ‌గ‌వంత్ కేస‌రి '...

బాల‌య్యా ఈ రికార్డుల గోల ఎంద‌య్యా… ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ బుకింగ్స్‌లో పంబ‌రేగిపోయే రికార్డ్‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. తొలి రోజు యావ‌రేజ్ కంటెంట్‌తో వ‌చ్చిన వీర‌సింహారెడ్డి సినిమాకే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 54 కోట్ల షేర్ వ‌చ్చింది.

అలాంటిది బ్లాక్‌బ‌స్ట‌ర్ కంటెంట్‌తో వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు రు. 33 కోట్ల గ్రాస్ మాత్ర‌మే రావ‌డంతో ఈ సినిమా విజ‌యంపై చాలా మంది డౌట్ వ్య‌క్తం చేశారు. అయితే తొలి రోజు వ‌సూళ్ల కంటే 4,5 రోజుల‌కు ఈ సినిమాకు మ‌రిన్ని ఎక్కువ వ‌సూళ్లు రావ‌డంతో ట్రేడ్ అంతా షాక్ అయిపోయింది. 6 రోజుల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 104 కోట్ల గ్రాస్ రాబ‌ట్టిన ఈ సినిమా రు. 52 కోట్ల షేర్ కొల్ల‌గొట్టి బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రైంది.

ఇప్ప‌టికే బుక్ మై షోలో లైకులు, టిక్కెట్ల బుకింగ్ ప‌రంగా స‌రికొత్త రికార్డులు కొల్ల‌గొట్టిన ఈ సినిమా తాజాగా మ‌రో సెన్షేష‌న‌ల్ రికార్డ్ త‌న ఖాతాలో వేసుకుంది. బుక్ మై షో యాప్ లో అయితే ఇప్పటివరకు భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు 1 మిలియన్ కి పైగా టికెట్స్ బుక్ చేసుకుని రికార్డు సెట్ చేసింది. బాల‌య్య కెరీర్‌లోనే ఇది ఆల్ టైం రికార్డ్‌. దీనిని బ‌ట్టి ఈ సినిమాకు రోజు రోజుకు ఆడియెన్స్ నుంచి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ ల‌భించిందో తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news