Newsబాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి ' ప్లాష్‌బ్యాక్ స్టోరీ తెలిసిపోయింది... ఆ...

బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ప్లాష్‌బ్యాక్ స్టోరీ తెలిసిపోయింది… ఆ రెండే హైలెట్‌…!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4 న ఈ సినిమా సెకండ్ సింగల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈనెల 8న భగవంత్‌ కేసరి ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య – శ్రీలీల బంధాన్ని చాటి చెబుతూ ఉయ్యాలో ఉయ్యాల అనే సాంగ్ ఉంటుందని ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ కోసం నందమూరి అభిమానులు, ఈ సినిమాపై అంచనాలతో ఉన్న ప్రతి ఒక్కరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్ అని తెలుస్తోంది. సినిమాలో బాలయ్య తెలంగాణ మాండలికంలో డైలాగులు చెప్పబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన సినీ కెరీర్ లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా సరికొత్త మాడ్యుయేషన్‌తో భగవంత్‌ కేసరి సినిమాలో డైలాగులు చెప్పబోతున్నారు.

సినిమాలో బాల‌య్య మాట తీరుతో పాటు ఆహార్యం చాలా కొత్తగా ఫ్రెష్ గా.. అలాగే సరదాగా కూడా ఉంటుందట. అనిల్ రావిపూడి బాలయ్య డైలాగులు, ఆహార్యం, యాక్టివిటీస్ ఇలా సినిమాలో హీరో పాత్ర కోసం చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేసినట్టు తెలుస్తోంది. సినిమాలో డైలాగులు అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తం లోనే బాల‌య్య యాస‌, డైలాగ్స్ మెయిన్ హైలెట్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news