Moviesఅభిమానులకు బిగ్ సర్ ప్రైజ్..ప్రభాస్ ను మీట్ అయిన అనుష్క తండ్రి..పెళ్లి...

అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్..ప్రభాస్ ను మీట్ అయిన అనుష్క తండ్రి..పెళ్లి గడియాలు వచ్చేశాయోచ్..!

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్నాడు అన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు అభిమానులు . ఇన్నాళ్లు ఈ హీరో పెళ్లి చేసుకుంటాడా..? లేదా అన్న ఒక అనుమానం ఉండేది . కానీ ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను పెళ్లి చేసుకుంటాను తిరుపతిలోనే చేసుకుంటాను అంటూ అభిమానులకు ప్రామిస్ చేశాడు.

ఆ తర్వాత పెళ్లి గురించి ఎక్కడ ప్రస్తావించకపోయినా.. రీసెంట్గా ప్రభాస్ ని అనుష్క తండ్రి మీట్ అవ్వడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనుష్క తండ్రి రీసెంట్గా ప్రభాస్ ని మీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పెళ్లి కోసం మీట్ అయ్యారా..? లేకపోతే ప్రభాస్ హెల్త్ బాగోలేని కారణంగా పరామర్శించడానికి మీట్ అయ్యారా..? అన్నది తెలియాల్సి ఉంది .

కానీ జనాలు మాత్రం అనుష్క తండ్రి ప్రభాస్ ని మీట్ అయ్యాడు అని తెలుసుకొని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాడేమో ..పెళ్లి ఘడియలు వచ్చేసాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ నిజంగా అనుష్క ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే అది అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి . చూద్దాం మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news