మలయాళి కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం .. నటనకి నటన ..రెస్పెక్ట్ కి రెస్పెక్ట్.. అల్లరితనానికి అల్లరితనం అన్ని కలగలిసిన ఓ అందాల ముద్దుగుమ్మ . నేటి యువత అమ్మాయి ఎలా ఉండాలి అంటూ ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అనుపమ పరమేశ్వరణ్. కాగా కెరియర్ స్టార్టింగ్ లో చాలా పద్ధతిగా రోల్స్ చేసుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు మాత్రం హాట్ హాట్ రోల్స్ చేసుకుంటుంది .
మరీ ముఖ్యంగా డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. ఎందుకు మలయాళం ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అన్న విషయంపై ఓపెన్ అయింది . నిజానికి ప్రేమమ్ సినిమా తర్వాత మలయాళం ఇండస్ట్రీలో అనుపమను బాగా ట్రోల్ చేశారట .
అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని అనుపమ చచ్చినా ఇక మలయాల సినిమాలు చేయకూడదు.. అంటూ డిసైడ్ అయిపోయిందట . తర్వాత సోషల్ మీడియా అంటే ఏంటి ..? సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి ..? అంటూ తెలుసుకున్నాక అనుపమ మళ్లీ మలయాళంలో సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది . ఇప్పుడు తెలుగులోనూ మలయాళంలో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది..!!