టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్న సుమకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా లిమిట్స్ గా ఎక్కడ వల్గారిటీ లేకుండా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. అయితే అలాంటి యాంకర్ సుమ తన చనిపోతే ఏం చేయాలి అనే విషయాన్ని పిల్లలకి ముందే చెప్పి షాక్ ఇచ్చింది .
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ సుమ “ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు తమ భర్త ఏదైనా ప్రాబ్లం కారణంగా చనిపోయిన ..యాక్సిడెంట్లో చనిపోయిన బ్రతుకుదెరువు కోసం పనులు చేసుకుంటున్నారని .. కొంతమంది ఆడవాళ్లకు అయితే అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియదు అని.. కానీ నేను మాత్రం అలా చేయడం లేదు అని ..నా పిల్లలకి ముందుగానే ఒకవేళ నేను చచ్చిపోతే మీకు ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది .. ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయి అన్ని క్లియర్గా ముందుగానే చెప్పి పెట్టానని “..చెప్పుకొచ్చింది.
“అయితే వాళ్ళు భయపడిపోయి ఎందుకు చెప్తున్నావ్ మమ్మీ ఇదంతా అంటూ షాక్ అయ్యారని చెప్పకు వచ్చింది”. ప్రతిదీ మనం పిల్లలకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అన్నిటికి సిద్ధపడి ఉండాలి అని సుమ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . సుమ చెప్పింది మంచికే అయినా మరోపక్క సుమ ఎందుకిలా చెప్పింది ..? ఆమెకు ఏదైనా హెల్త్ బాగోలేదా ..? అందుకే పిల్లలకు ముందుగానే హింట్ ఇస్తుందా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు..!!