సినీ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనైనా ఒకరు పైకి రావాలంటే ఇంకొకరిని కిందకి తొక్కాల్సిందే అంటుంటారు. అప్పుడే వీడి సత్తా ఏంటో తెలుస్తుందీ అని. కానీ, అది అన్నిసార్లూ అన్ని చోట్ల కుదరకపోవచ్చు. మనం ఒకడికి అన్యాయం చేస్తే ఇంకో చోట దానికి మించిన పరాభవం చూడాల్సి వస్తుంది. ఇందులో అసలు ఎటువంటి సందేహమే లేదు. అది చూసిన సీనీ తారలు చాలామంది ఉన్నారు.
తెలుగులో ఒకప్పుడు పాపులర్ యాంకర్ గా ఝాన్సీకి మంచి పేరుంది. ఇప్పుడు కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. ఝాన్సీ మాజీ భర్త అందరికీ తెలిసినవాడే. జోగి నాయుడు. జోగి బ్రదర్స్ అని ఇద్దరుంటారు. వీద్దరూ కలిసి పాపులర్ ఛానల్ లో ఒక షో చేశారు. అది బాగా పాపులర్ అయింది. దాంతో జోగి నాయుడు బాగా పేరులోకి వచ్చాడు. అప్పట్లో ఝాన్సీకి అనుకున్నంతగా అవకాశాలు వచ్చేవి కావట.
దాంతో జోగి నాయుడుని పట్టుకుంటే సక్సెస్ చూడొచ్చుననే ఆలోచన ఝాన్సీకి కలిగిందట. నెమ్మదిగా క్లోజ్ అవడం ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. జోగి నాయుడు కాంటాక్స్ అన్నీ ఝాన్సీ తీసుకుందట. అవకాశాల కోసం నేరుగా కలవడం లేనా దేనా పద్ధతిలో అవకాశాలు అందుకోవడం చేసిందట. ఒకదశలో ఝాన్సీ బిజీ యాంకర్ అయిపోయింది. మంచి రెమ్యునరేషన్. ఇంకోవైపు సినిమాలలో అవకాశాలు.
ఇక నాకు తిరుగు లేదనుకుందేమో జోగి నాయుడుతో తెగతెంపులు చేసుకుంది. మెల్లగా దూరం పెట్టడం మొదలు పెట్టిన ఝాన్సీ ఏకంగా విడాకులు తీసుకుంది. అయితే, ఇందులో నిజం లేదనే ఆమె ఎప్పుడూ వాపోతుంటుంది. కానీ, ఇండస్ట్రీలో మాత్రం కెరీర్ కోసం ఝాన్సీ జోగి నాయుడుని వాడుకుందని చెప్పుకుంటుంటారు. ఇందులో నిజా నిజాలేంటో ఆ దేవుడికే తెలియాలి.