Moviesపవన్ కళ్యాణ్ ను కెలికిన అనసూయ.. ప్రెస్ మీట్ లో అంత...

పవన్ కళ్యాణ్ ను కెలికిన అనసూయ.. ప్రెస్ మీట్ లో అంత మాట అనేసింది ఏంటి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం చాలా కామన్ గా మారిపోయింది . అసలు స్టార్ సెలబ్రిటీలు ఏం మాట్లాడుతున్నారు.. దేని గురించి మాట్లాడుతున్నారు అనే విషయం పక్కన పెట్టి .. ఆ విషయానికి మరొక స్టార్ సెలబ్రిటీ మేటర్ ని ఇన్వాల్వ్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా అనసూయ సైతం అదే ట్రోలింగ్ కి మరోసారి గురవుతుంది .

జబర్దస్త్ మానేశాక పలు సినిమాల్లో ఇంపార్టెంట్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్న అనసూయ తాజాగా రజాకర్ మూవీలో నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి భారతి భారతి ఉయ్యాలో అనే పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ ప్రెస్ మీట్ లో పాల్గొంది. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్త వైరల్ అవుతుంది.. దానిపై మీ స్పందన అని అడగ్గా..” నేను రాజకీయాల్లోకి రావడం లేదు .. నాకు రాజకీయాలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు ..ఎవరు నాతో చర్చలు జరపలేదు. ఆ వార్తల్లో వాస్తవం లేదు.. సమాజ సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలా..? నా వరకు నేను నాకు ఉన్నంతలో సమాజ సేవ చేస్తున్నాను . అదే నాకు చాలా హ్యాపీ.. రాజకీయాల్లోకి వచ్చే సమాజసేవ చేయాలి అని అనుకోవడం అంటూక్లారిటీ ఇచ్చింది.

అయితే అనసూయ మాటలు ఎక్కడో పరోక్షంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లే ఉన్నాయి అంటున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అంటూ చాలా సార్లు చెప్పారు. ఇదే విషయాని ఇప్పుడు అనసూయ మాట్లాడిన మాటలకు కౌంటర్ వేస్తున్నారు. అనసూయ చెప్పింది నిజమేగా .. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలా ..? అంటూ పలువురు కావాలనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ట్రోల్ల్ చేస్తున్నారు. అయితే అనసూయ పవన్ కళ్యాణ్ ని అసలు ఉద్దేశించి మాట్లాడిందో..? లేకపోతే ఆమె వర్షన్ ఆమె వినిపించిందో ..? ఆమె మాటల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ అన్న పేరు రాలేదు.. కానీ కొందరు కావాలని అనసూయ మాటలకు పవన్ మాటలను జోడిస్తూ వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news