రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం బేబీ. చాలా తక్కువ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇది విమర్శకులు ఆడియన్స్ మంచి రివ్యూస్ పొందడమే కాక భారీ కలెక్షన్లను రాబట్టింది. లీడ్ పెయిర్ అయినాఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. వారి పేర్లు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండింగ్ కూడా అయ్యాయి.
అయితే ఇప్పుడు, బేబీ మూవీ లవర్స్‌ను ఖుషి చేసే ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఆనంద్, వైష్ణవి మరో సినిమా కోసం మళ్లీ జతకట్టనున్నారు. మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ఆనంద్ కన్నీటి పర్యంతమైన వైష్ణవిని ఓదార్చుతున్నట్లు ఉంది. ఇది విభిన్నమైన ప్రేమకథను సూచిస్తుంది.
బేబీ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథను అందించారు. బేబీని నిర్మించిన SKNతో కలిసి ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రవి నంబూరి దర్శకుడిగా తొలి చిత్రం. అతను వెబ్ సిరీస్ “3 రోజెస్”కి రచయితగా, ప్రతిరోజు పండగే చిత్రానికి సహ రచయితగా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆనంద్, వైష్ణవిని కొత్త అవతార్‌లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రానికి బేబీకి మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీత బాణీలు సమకూరుస్తున్నాడు. దీంతో అప్ కమింగ్ మూవీ సాంగ్స్ అదిరిపోతాయని అర్థం చేసుకోవచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రెండో సినిమా కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే ఆనంద్ వైష్ణవి కాంబో మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండుతోంది. రష్మిక విజయ్ ఎలాంటి హిట్ పెయిర్ అయ్యారో ఆనంద్ వైష్ణవి కూడా అలాగే హిట్ పెయిర్ పెయిర్ అవుతారని చెప్పడంలో సందేహం లేదు.