సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని గూగుల్ ద్వారా తెలుసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది . అయితే కొందరు జనాలు మాత్రం తమ విషయాలను బయటకు చెప్పుకోలేక బయటకు చెప్పుకుంటే ఏమనుకుంటారు ..అంటూ కుళ్ళుకొని బాధపడుతూ కొన్ని కొన్ని సమస్యలను తమలో తామే దాచుకుంటున్నారు . అలాంటి మానసిక రోగాలు చాలామందికి ఉన్నాయి .
అయితే ఇలాంటి మానసిక వ్యాధులు ఎదుర్కొంటున్న వాళ్లపై అమీర్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు . తన కూతురు ఐరా ఖాన్ తో కలిసి మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు స్పెషల్ మెసేజ్ అందజేశారు. ” ప్రతి మనిషికి ఆ ప్రాబ్లం ఉంటుంది .. అది బయటకు చెప్పుకున్నప్పుడే క్లియర్ అవుతుంది .. వైద్యుడు అయిన ..ఉపాధ్యాయుడు అయిన .. వడ్రంగి అయిన..ఆయా రంగాలలో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే . ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి . వాటికి నిపుణులు సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి . బయటకి చెప్తే ఎవరైనా ఏమనుకుంటారో అనుకోవద్దు ..సిగ్గు పడొద్దు మానసిక ఆరోగ్య నిపుణుని సహాయం పొందండి “.
“గతంలో నేను నా కుమార్తె కూడా ఇలాగే బాధపడుతూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నాం.. మేము చాలా రికవరీ అయ్యాం ..మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నాను ..ఆల్ ద బెస్ట్ “అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!